తెలంగాణలో ముందస్తు ఎన్నికలు?

Updated By ManamMon, 08/20/2018 - 13:40
Uttam kumar reddy
Uttam Kumar Reddy

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఊహాగానాలు జోరందుకున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ ...అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలు వెళతుందని కొద్దిరోజుల క్రితం వార్తలు వెలువడగా, తాజాగా టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటి నుంచి కూడా ముందస్తు ఎన్నికలు వినిపిస్తున్నాయి. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ.. హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే టీఆర్ఎస్ సర్కార్ ముందస్తుకు వెళుతుందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. 

త్వరలోనే ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అందరికీ ప్రాధాన్యత ఇస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.  ఓటర్ల జాబితాలో ఓటర్లు తమ పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించారు. ఇక వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆన్‌లైన్ పోలింగ్ ద్వారా అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. టీఆర్ఎస్ సర్కార్...సర్పంచ్ నుంచి ఎంపీ వరకూ ప్రతి ఒక్కర్ని కొనుగోలు చేస్తుందన్నారు.

English Title
Telangana PCC chief uttam kumar reddy hints at early elections for Telangana
Related News