తెలంగాణ ఎన్నికలపై వారంలో నిర్ణయం!

Updated By ManamFri, 09/07/2018 - 16:35
CEC OP Rawat breaks his silence over telangana elections
CEC OP Rawat breaks his silence over telangana elections

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలో, లేదో అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్‌ స్పష్టం చేశారు. దీని సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, దానికి వారం సమయం పట్టవచ్చని అన్నారు. 

అలాగే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి నివేదిక వచ్చాకే ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం కాకుండా ఎవరూ ప్రకటించకూడదన్నారు. అయితే నేతలే ఎన్నికల తేదీలను ప్రకటించడం దురదృష్టకరమన్న రావత్ ... ఎవరో చెప్పిన జోస్యానికి...ఈసీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, మిజోరాం సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు తగిన ఏర్పాట్లను సమీక్షించాల్సి ఉంటుందని ఓపీ రావత్ పేర్కొన్నారు. చట్టంలో ఈ విషయంపై ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనా లేదని, దీనిపై 2002లో రాష్ట్రపతి సుప్రీం కోర్టు అభిప్రాయం కోరగా.. అసెంబ్లీ రద్దయినప్పుడు ఎన్నికలు త్వరగా జరపాలని అత్యున్నత న్యాయస్థానం సూచించిందన్నారు. 

ఎందుకంటే ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఆయాచిత ప్రయోజనంపొందేలా ఆరు నెలల పాటు అధికారంలో ఉండకూడదని సూచించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటామని రావత్‌ స్పష్టం చేశారు. అలాగే జమిలి ఎన్నికలైతే పార్లమెంట్‌తో పాటే తెలంగాణ అసెంబ్లీకి జరిగేవని, ఏప్రిల్‌ 2019లో అవి జరగాల్సి ఉందన్నారు. కానీ ఇప్పుడు ఆ వాదనకు అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.  

English Title
Telangana polls not on basis of someone astrological choices: CEC
Related News