తెలంగాణ పునర్నిర్మాణోద్యమం

Updated By ManamMon, 09/24/2018 - 01:06
mathanam

imageతెలంగాణ ఉద్యమం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాం క్షకై హక్కులకై జరిగిన పోరాటం దేశాన్నే ఆలోచనలోకి నెట్టింది. ఒక ప్రాంతం తన హక్కుల కోసం, అణచివేతకు, అసమాన తలకు గురవుతున్న తన అస్తిత్వాన్ని కాపాడుకోవ టానికి దేశ పాలకులతో యుద్ధం చేసింది. సుదీర్ఘంగా సాగిన ఈ ఉద్యమం ఎన్నో చర్చలు, ఎన్నో త్యాగాలకు వేదిక అయింది. తొలిదశ ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు. ఉద్యమం కోసం ఎన్నో వేదికలు పుట్టుకొచ్చాయి కానీ నిలు వలేదు. కాదు కాదు వాటిని సమైక్య పాలకులు నిలువ నివ్వలేదు. తెలంగాణ ఒక రాష్ట్రం అయితే తమ ఆటలు సాగవని పదవుల ఆశతో ఎన్నో సంఘాలను, వేదికలను వారు అంతం చేసి ఉద్యమాన్ని నిలు వరించగలిగారు.

కానీ అప్పుడే మలి దశ ఉద్యమం  మొద లైంది. కరెంట్ కోతలకు నిరసనగా తెలంగాణకు జరుగుతున్నimage అన్యాయాన్ని, వివక్ష కు వ్యతిరేకంగా పదవులు వదిలి ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ రూపంలో మలిదశ ఉద్య మానికి మరోసారి బీజం పడింది. అప్పుడు రాష్ట్రాన్ని పాలి స్తున్న పాలకులు, ప్రతిపక్షం సైతం ఈ బక్కమనిషితో తెలం గాణ అవుతదా అంటూ అవహేళనలు అవమానాలు చేసారు. వాళ్ళ అనుమానానికి కారణం లేకపోలేదు ఎందుకంటే అప్ప టికే తెలంగాణ కోసం ఎన్నో వేదికలు పుట్టుకొచ్చాయి. మర్రి చెన్నారెడ్డి, జానారెడ్డి ఇలా మొదలెట్టి వదిలేసిన వాళ్ళే ఈ ఉదాహరణలే వారికి ఆ అనుమానాన్ని కలిగించాయి. కేసీఆర్ మలిదశ  తెలంగాణ ఉద్యమం మొదలెట్టినప్పుడు చిన్న టెంట్ కింద ఒక సమావేశం ఈయన తెలంగాణ తెస్తాడా పిడికెడంత మంది లేరు వీళ్ళతో తెలంగాణ వస్తుందా? ఈయన కూడా అందరిలాగానే జారుకుంటాడని నవ్వుకున్నారంతా. కానీ  2001 ఏప్రిల్ 27న అదే టెంట్ కింద నుండి అగ్గి రేగి, తెలం గాణ ఏర్పాటుకు బీజం పడింది.

అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఎంపీటీసి, జెడ్పీటీసి ఎన్నికల్లో కేసీఆర్ సారథ్యంలోని తెరాసా అత్యధిక స్థానాల్లో విజయం సాధించి తెలంగాణ ఆకాంక్ష ప్రజల్లో ఉం దని పాలకులకు వివరించింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని స్థానాలు గెలిచి తెలంగాణ పోరాటం కోసం పలుమార్లు పదవులను సైతం తృణప్రాయంగా వదిలి తిరిగి ప్రజల్లోకి వెళ్లి తెలంగాణపై చర్చ జరిగేలా చేసి విజయం సాధించారు. ప్రజల్లో రాజీనామాల ద్వారా చర్చ రాజేసారు. తెలంగాణ అంటే కేసీఆర్ అనే స్థాయికి ప్రజలు చేరారంటే అతి శయోక్తి లేదు. కేసీఆర్ తెగువను చూసి రాష్ట్రపతి ప్రసంగంలో సైతం తెలంగాణ అంశాన్ని చేర్చే స్థితిని కేసీఆర్ తీసుకువ చ్చారు. తెలంగాణ ఏర్పాటును అంగీకరిస్తూ 2004లో తెరాసా తో కాంగ్రెస్ పొత్తు, చంద్ర బాబుతో 2009లో పొత్తు పెట్టుకుని విజయ కేతనం ఎగురవేశారు. తెలంగాణ వాదం ప్రజల్లో పోకూడదని నిరంతరం సభల ద్వారా ఆ వాదాన్ని అలాగే ఉంచేలా చేసాడు కేసీఆర్.

ఇదంతా ఒకెత్తు అయితే 2009లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహర దీక్ష తెలంగాణా ఉద్యమ గతిని మార్చే సింది. 2009 డిసెంబర్ 9న ప్రకటనతో తెలంగాణ ఏర్పాటు ప్రకటన, అనంతరం సీమాంధ్ర నేతల కుట్రలతో డిసెంబర్ 23 ప్రకటన, శ్రీకృష్ణ కమిటి ఇలా రకరకాల చర్చలు జరిగా యి. తెలంగాణ కోసం తెరాసా తమ పదవులను త్యాగం చేసింది. కేసీఆర్, తెలంగాణ ప్రజల పోరాటం ఎందరో వీరుల బలిదానం, దేశ రాజకీయ వ్యవస్థలోని కీలక వ్యక్తులకు తెలం గాణ రాష్ట్ర అవసరం ఆవశ్యకతను వివరిస్తూ కాలికి బలపం కట్టుకుని జాతీయ నేతల చుట్టూ కేసీఆర్ తిరిగి వారి మద్దతు కూడ గట్టారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కానీ తెలంగాణ ఆషామాషీగా రాలేదు. ఎన్నో పోరాటాలతో అని వార్య పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటవగానే వేల కొర్రీలు, ఎక్కడ ఏముందో తెలియదు కొత్త రాష్ట్రం కొత్త ప్రభుత్వం అంతకు ముందు పాలించిన వారు చేసిన తప్పుల కుప్ప కళ్ళముందు కదలాడుతోంది. తెలంగాణకు దశాబ్దాలుగా జరిగిన అన్యా యం, విధ్వంసం స్పష్టంగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ముందు ఉంది. ఏడాది తిరగక ముందే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఏపీ సాక్షిగా మొదలైంది. ఓటుకు నోటుతో ప్రభుత్వాన్నే కూల్చే కుట్ర జరిగింది. దాన్ని వ్యూహాత్మకంగా చే ధించారు కేసీఆర్. అనంతరం ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని సుదీర్ఘ ఆలోచ నలు చేసారు. రాష్ట్ర అభివృద్ధికి అద్భుత ప్రణాళికలు రచిం చారు. వాటిని అమలులో పెట్టారు, విజయం సాధించారు. తెలంగాణ ఒక విఫల ప్రయోగం అన్న చోట దేశంలోనే తెలం గాణను నంబర్ వన్‌గా నిలిపారు. ముసల వ్వలకు ‘ఆసరా’గా 1000రూపాయల పించను, దివ్యాంగు లకు 1500 పింఛను, కల్యాణలక్ష్మితో పేదింటి ఆడబిడ్డకు అండగా, కేసీఆర్ కిట్ ఆరోగ్యలక్ష్మితో పేదింటికి పెద్దన్నలా, గురుకులాలు, సన్న బియ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజ్‌లో, హాస్టల్లలో భోజ నంతో పేదవారికి విద్యను అందు బాటులోకి తెచ్చాడు. కార్పో రేట్ వైద్యం, విద్యకు దీటుగా ప్రభుత్వ వైద్య, విద్యను నిల బెట్టాడు. గురుకులాల ద్వారా పేదవాడికి గొప్ప చదువును అం దజేసారు. బతుకు చిద్రమ వుతున్న నేతన్న బాధ్యతను భుజానేసుకుని ఉరిసిల్లాగా మారిన సిరిసిల్లాను బంగారు వల్లిగా మార్చారు. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రం లో అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణను ముం దుంచారు.

దేశంలోనే కనీ వినీ ఎరుగని రీతిలో రైతుల కోసం గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు కేసీఆర్ ఎరువుల కొరతను తగ్గించి, రైతు పెట్టు బడి సాయం ద్వారా ఎకరాకు 4వేల చొప్పన రెండు పంటలకు కలిపి రూ.8000 అందిస్తూ రైతుకు పెట్టుబడి సాయ మై, 24 గంటల నిరంత ఉచిత విద్యుత్‌తో రైతు కష్టాలను తీర్చాడు. నాడు కరెంట్ వస్తే వార్త నేడు కరెంట్ పోతే వార్త. రైతుబంధు ద్వారా రైతు కుటుంబానికి భరోసానిస్తూ రూ.5 లక్షల భీమా కల్పించారు. తద్వారా రైతు కుటుంబాలు ధైర్యంగా గుండెపై చేయి వేసుకుని ఉండేలా చేసారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చే ప్రయత్నం ప్రారంభించారు. డబుల్ బెడ్ రూం ద్వారా పేదల ఆత్మ గౌరవ ప్రతీకగా నిలిచారు. నీరే జగతికి మూలం వ్యవసాయానికి నీరే ఆధారం అంటూ సమైక్య పాలనలో విధ్వంసానికి గురై తాంబాలంలా మారిన చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించి చెరువులకు జల కళ తీసుకొచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకుని ఆ దిశగా విజయవంతంగా అడుగులేసి నీళ్ళు లేని చోట నీళ్ళు పారించిన ఘనత కేసీఆర్‌ది. నీరు లేక పంట పండక వలసబాట పట్టిన పాలమూరు పల్లెలను నీళ్ళతో తడిపి నూతన చరిత్ర సృష్టించి వాళ్ల బ్రతుకుల్లో వెలుగు నింపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికే తలమానికంగా నిలుస్తుంది. దురదృష్టం ఏంటంటే రైతులకు ప్రయోజనాలు చేకూర్చే ప్రాజెక్టులపై రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా అనేక కేసులు వేయించింది. రైతు ప్రయోజనాల కోసం ముందుకెళుతున్న ప్రభుత్వానికి కాళ్ళలో కట్టెలు వేసి ఆపే ప్రయత్నం చేసింది. అయినా ఎక్కడా వెర వకుండా తెలంగాణా కోటి ఎకరాల మాగాణం కావాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్ ముందుకు కదిలారు.

తెలంగాణకు కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను చెప్పా లంటే ఒక రోజు సరిపోదు. మానిఫెస్టోలో పెట్టినవే కాకుం డా సుమారు 400 పైగా కార్య క్రమాలు చేపట్టి ప్రజల బ్రతు కుల్లో మార్పు కోసం విశేష కృషి చేసారు కేసీ ఆర్. ఐటీ హబ్‌ను తీసుకొచ్చి నూతన పారిశ్రామిక విధానం రూపొందించి పెట్టుబడుల వెల్లు వను సృష్టించారు.

తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ నే లక్ష్యంగా అధికార వాంఛతో ప్రభు త్వ ఉద్దేశ్యాలను, నిబద్దతగా పనిచేస్తున్న అదికారుల స్థైర్యాన్ని వీళ్ళ మాటల ద్వారా దెబ్బతీస్తూ అభి వృద్దికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్దం అంటూ ప్రకటించి అభ్యర్థులను సైతం ప్రకటించి ప్రజా ఆశీర్వాద సభ ద్వారా వారి కుట్రలను వివరించి శంఖారావం పూరించారు. ఇన్ని రోజులు తప్పుకో, దిగిపో అంటూ అడ్డం పొడవు వాదించిన ప్రతిపక్షాలు నేడు కేసీఆర్ నిర్ణయంతో ఆత్మరక్షణలో పడ్డారు. 

తెలంగాణ అభివృద్దిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ టీడీపీ జతకట్టుతున్నాయి. నాడైనా నేడైనా వారి ఎజెండా తెలం గాణను ముంచడమే. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏడేండ్ల క్రితం, శ్రీకృష్ణ కమిటీ కుట్రపూరితంగా రాసిన రహస్య 8వ అధ్యా యంలో, తెలంగాణను అడ్డుకోవాలంటే కాంగ్రెస్, తెదేపా కలిసి పనిచేయాలని ఒక సూచన చేసారు. అదే నేడు అభివృద్ధ్దికి అడ్డం పడేందుకు నిజం చేస్తున్నారు. ఈ పరిణా మాలు ప్రజలు గమనిస్తున్నారు. ఈ విష కౌగిలి పట్ల ప్రజలు అప్ర మత్తంగా ఉండాలి. ఏమంత ఏమరపాటు ప్రదర్శించినా తెలంగాణా అగాథంలోకి నెట్టేయబడుతుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో అదేదో సినిమాలో వేలం పాటలా ఉంది. నువ్వు 10 అంటే నేను 20 అంటా అన్న చందంగా వాళ్ళు హామీలు గుప్పిస్తున్నారు. ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, అభి వృద్ది కార్య క్రమాలను కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేపట్టారు. పేదవాడి మనసును తట్టిలేపారు. ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. వచ్చిన తెలంగాణ సుభిక్షం కావాలంటే మరింత మేలు ప్రజ లకు జరగాలి. తక్కువ సమయంలో ఎక్కువ మేలు ప్రజ లకు చేయగలిగారు. 

తెలంగాణకు మేలు జర గాలంటే కేసీఆర్ మొదలెట్టిన ఈ ‘పుణర్నిర్మాణోద్యమం’ పూర్తి కావాలంటే మరో సారి కేసీఆర్‌కు అవకాశం ఇవ్వాలి. ఆయన మాటల్లోనే స్పష్టమవవుతుంది ఆయన ఉద్దేశం. తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు గొప్పగా బతికినప్పుడే నా జన్మకు అర్దం అని, తెలంగాణ అభివృద్ది చట్రం ఢిల్లీ బానిసల చేతిలో చిక్కి ఆగకూడదనే అతని మహా సంకల్పం నిజం చేసేందుకు ప్రజలంతా కేసీఆర్‌కు అండగా నిలవాలి. నాడు తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే యావత్ తెలంగాణ కేసీఆర్ వెంట నడిచారో నేడు తెలంగాణ పునర్నిర్మాణోద్య మంలో కూడా కేసీఆర్ వెంట ప్రజలు నడిచి మరోమారు తెరాసాకు పట్టం కట్టడం ద్వారా తెలంగాణను పుణర్నిర్మించేందుకు కేసీఆర్‌కు మరో అవకాశం కల్పించాలి. ఎన్నో పోరాటల ద్వారా సాదించుకున్న తెలంగాణ కాంగ్రెస్ రాబందుల చేతికి చిక్కకూడదు. ప్రజల జీవితాలు ఢిల్లీ గద్దెల వద్ద తాకట్టు పెట్టబడతాయి. ఢిల్లీకి బానిసలుగా ఉందామో..? లేదా మన పాల న, మన నిర్ణయాధికారం తెలంగాణాలోనే ఉంచుకుందామో ప్రజలు తమ ఓటు ద్వారా తీర్పునీయాలి. తెలంగాణ ఆత్మ ను ఆవిష్కరిస్తున్న కేసీఆర్ గారికి అండగా నిలిచి చైతన్యం కలిగిన  తెలంగాణ ప్రజలు మన రాష్ట్రాన్ని గెలిపించుకోవాలి. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష...

-  టి. విజయ్
 9491998702

Tags
English Title
Telangana Reconstruction Movement
Related News