ఠారెత్తిస్తున్న ఎండలు: మరో మూడు రోజులు ఇదే పరిస్థితి

Updated By ManamThu, 06/21/2018 - 11:06
Temperature

Temperature విశాఖ: ఏపీలో మరో మూడు రోజులు భారీ ఉష్ణోగ్రతలు ఉండనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, దీంతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు స్కూళ్లను సెలవును పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే ఈ సంవత్సరం రాష్ట్రంలోకి త్వరగానే ప్రవేశించిన రుతుపవనాలు ఉన్నట్లుండి బలహీనపడ్డాయి. దీంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. ఈ తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 41 డిగ్రీల వరకు.. విజయనగరం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 38 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే 22న కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. 23న శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ సూచనలు చేసింది.

English Title
Temperature continue in Andhrapradesh for three days
Related News