‘పాము’ గుడికి పనులు ప్రారంభం

Updated By ManamSat, 08/04/2018 - 09:32
snake

snake తూర్పుగోదావరి: 26 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామస్థుల చేత సుబ్రమణ్యస్వామిగా పూజలందుకున్న పాము గురువారం మరణించగా.. శుక్రవారం అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. గురువారం రాత్రంతా శివాలయంలో ఉంచి భజనలు, ప్రత్యేక పూజలు చేసి.. శుక్రవారం పామును  పల్లకిలో పామును పెట్టి గ్రామమంతా ఊరేగించి అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు గ్రామస్థులు. ఆ తరువాత పాము తిరుగాడిన చోటనే ఖననం చేశారు. అక్కడ గుడి కట్టించేందుకు పొలం యజమాని అంగీకరించడంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. శ్రావణ మాసంలోగా గుడి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని గ్రామస్థులు తెలిపారు.

English Title
Temple for snake in East Godavari district
Related News