ఇది పరీక్షా కాలం

Updated By ManamSat, 02/10/2018 - 01:22
rahul

ిల్ెనఇందిరా గాంధీ, నరేంద్ర మోదీల మాదిరిగా ఆయన ఆకర్షణీయైమెన నినాదాలను కొన్నిటిని సృష్టించాల్సిన అవసరం కూడా ఉంది. ఇందిరా గాంధీ రోటీ కపడా ఔర్ మకాన్, గరీబీ హటావోవంటి నినాదాలతో విజయాలు సాధించారన్న విషయాన్ని ఆయన గమనించడం మంచిది. నరేంద్ర మోదీ అటువంటి నినాదాలు సృష్టించడంలో సిద్ధహస్తులు. ఆయన ఆదాయం, ఉద్యోగాలు,న్యాయం, నిజాయతీ వంటి అంశాలతో నినాదాలను రూపొం దించడం మంచిది. ఆశయాలు, అభివృద్ధిని ఊతంగా చేసుకుని నినాదాలను రూపొందించాల్సి ఉంటుంది. ఇందిరా గాంధీసృష్టించినట్టే ఓ పది సూత్రాల కార్యక్రమాన్ని సృష్టించి, దాంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది.

మరో  ఏడాదిలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీని, బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అస్త్రశస్త్రాలన్నిటినీ సిద్ధం చేసుకుంటున్నారు. ఆ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. అయితే, వాస్తవంగా ఆయన లక్ష్యం మాత్రం 2024లో జరగబోయే ఎన్నికలేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తాను, తన పార్టీ అధికారంలోకి
రావాలంటే పార్టీని అంతర్గతంగా సిద్ధం చేయడానికి, తాను సరైన వ్యూహాలను అనుసరించడానికి ఇంకా కొంత సమయం అవసరం అవుతుందని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ ఉద్దేశంతోనే ఆయన 2024 నాటికి ఓ బృహత్ ప్రణాళికను రూపొందించుకుని ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆయన తన వ్యక్తిగత కార్యాచరణ బృందంలో సీనియర్లకు, వృద్ధుల స్థానే యువకులను నింపే ప్రయత్నంలో ఉన్నారు. మరో అయిదారేళ్లు కనుక ఆగితే, అహ్మద్ పటేల్, మోతీలాల్ వోరా, ఏకే ఆంటొనీ, చిదంబరం, దిగ్విజయ్ సింగ్ వంటి వారు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటారని, అప్పుడు తన అభీష్టం ప్రకారం పార్టీని పటిష్టం చేసుకుని, బీజేపీని ఢీకొట్టవచ్చని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ సీనియర్ నాయకులంతా ఆయన తల్లి సోనియా గాంధీ కోటరీకి సంబంధించినవారు. వారంతా తమకు తాముగా, హుందాగా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. వారు తప్పుకునేలోగా తనకు విధేయులైన యువ నాయకులను సమీకరించుకోవాలనేది ఆయన ప్రయత్నం. నిజానికి ఇప్పటికే పార్టీలో కొన్ని కొత్త ముఖాలు ప్రవేశిస్తున్నాయి. వారంతా రాహుల్‌కు నమ్మకస్తులే. అయితే, వారు పూర్తిస్థాయి నాయకులుగా తయారై, రాహుల్‌కు సరైన సమయంలో సరైన సహాయ సహకారాలు అందించడానికి ఎంత లేదన్నా కనీసం ఐదేళ్లు పడుతుందని అంచనా. ప్రస్తుతం వారికి అవసరైవెునంత రాజకీయానుభవం లేదు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో కూడా ఆయన వినూత్న ప్రచారం చేపట్టాలని భావిస్తున్నారు. ఈ ప్రచారం సీనియర్ నాయకుల శైలికి భిన్నంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. ఆయన యువతరం విధేయుల్లో ఐఏఎస్ నుంచి రాజీనామా చేసినవాళ్లు, టెక్కీలు, ఎంబీలు ఉన్నారు. సుమారు 20 మంది యువకులతో ఇటువంటి బృందాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభల ఎన్నికల తర్వాత రాహుల్ వ్యవహారైశెలి బాగా మెరుగుపడింది. ముఖ్యంగా గుజరాత్‌లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడం, కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడడం, ఆ తరువాత రాజస్థాన్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయ దుందుభి మోగించడం ఆయనకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఇప్పటికే పార్టీలో తమ ప్రభావాన్ని చూపిస్తున్న సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా, అశోక్ గెహ్లాట్, కమల్‌నాథ్ వంటి యువ నాయకుల సహాయ సహకారాలతో రాహుల్ గాంధీ రాజకీయానుభవం బాగా పదునెక్కింది. ఆయన ఇప్పటికీ కొందరు సీనియర్ నాయకుల మీద ఆధారపడాల్సి వస్తున్నప్పటికీ, తన యువ విధేయులతో మాత్రం ఆయన మనసు విప్పి రాజకీయ వ్యూహాలు, అంశాలు చర్చిస్తున్నారు. తన పార్టీ పటిష్ఠత గురించే కాక, బీజేపీ స్థితిగతుల మీద కూడా లోతుగా అధ్యయనం చేస్తున్న రాహుల్ గాంధీ బీజేపీ ప్రతిష్ఠ ఎక్కువ కాలం ప్రస్తుత స్థితిలో ఉండదని భావిస్తున్నారు. మరో నాలుగేళ్లలో బీజేపీ బాగా బలహీనపడడం ఖాయమనీ, అది ఇప్పటికే ఓ అభిలషణీయ స్థాయికి చేరుకుని, ఇక అంతకు మించి ముందుకు పోయే అవకాశం లేకుండా చేసుకుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

వ్యూహ ప్రతివ్యూహాలు
దక్షిణాది రాష్ట్రాలలో అడుగు పెట్టడానికి ఏమాత్రం అవకాశం లేని బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలలో కూడా తిరుగు ముఖం పడుతోందని ఆయన తన మిత్రులతో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి దేశంలో ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం కాంగ్రెసేనని, బీజేపీతో విసుగెత్తిపోయిన ప్రజలు తమ వైపే మొగ్గు చూపడం ఖాయమని ఆయన ఆశిస్తున్నారు. ఆయన ఇప్పుడు తనకు అవకాశం కోసం
ఎదురు చూస్తున్నారు. సోనియా కోటరీలోని కొందరు సీనియర్ నాయకులలో తనకు విధేయులైనవారు కూడా ఉన్న విషయం ఆయనకు బాగా తెలుసు. అదే సమయంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వంటి నాయకులకు తన నాయకత్వం అంగీకారయోగ్యం కాదన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. పార్టీ నిధుల కోసం కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తిగా తాము అధికారంలో ఉన్న కర్ణాటక, పంజాబ్‌ల మీదే ఆధారపడుతున్నందువల్ల ఆయన ప్రస్తుతానికి సిద్దరామయ్య, అమరీందర్ సింగ్‌ల జోలికి వెళ్లడం లేదు. అయితే, రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి ఆయన మొదట్లోనే ప్రణబ్ ముఖర్జీని దూరంలో ఉంచగలిగారు. కర్ణాటకను కాపాడుకోవడం ఆ పార్టీకి అవసరం. బీజేపీ గనుక ఆ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అంచనాలు తలకిందులవుతాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వీలైనంత మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని రాహుల్ వ్యూహం రూపొందిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ నాయకత్వంలో తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొని ఉన్నాయి. వాటిని పరిష్కరించడం మీద రాహుల్ ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించి ఉన్నారు. రాజస్థాన్‌లో సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్‌లను, మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్‌లను ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాలలో సమస్యలను పరిష్కరించడానికి ఆయన తప్పనిసరి పరిస్థితులో కొందరు సీనియర్ నాయకుల మీద కూడా ఆధారపడాల్సి వస్తోంది.మొత్తానికి ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే తాను అధికారం కోసం 2024 వరకూ వేచి చూడాల్సిందేనని ఆయన భావిస్తున్నారు. అయితే, తన పార్టీపై తన పట్టు, పలుకుబడి పెరగాలన్న పక్షంలో తన నాయకత్వంలో పార్టీ కర్ణాటకలో విజయం సాధించాల్సిన అవసరం ఉందని ఆయనకు తెలుసు. అవసరైమెతే సోదరి ప్రియాంక గాంధీని కూడా రంగంలోకి దింపాలని,కర్ణాటకలో గెలిచిన తర్వాత ఆమెకు కూడా పార్టీలో తగిన పదవిని ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది చివరి నాటికి సోనియా గాంధీ రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగే అవకాశం ఉంది. పార్టీలో పలువురు సీనియర్ నాయకులు ఇప్పటికీ సోనియాను, ప్రియాంకను మాత్రమే సంప్రతించడం, తనను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఆయనకు కినుకగా ఉంది. కర్ణాటక ఎన్నికల వరకూ ఆగి, ఆ తరువాత ఆ పద్ధతిని మార్చాలని ఆయన ఆలోచిస్తున్నారు. రాహుల్‌కు వామపక్ష సిద్ధాం తాల  పట్ల కాస్తంత అభిమానం  ఉంది. సీతారాం  ఏచూరి వంటి నాయకులను ఆయన అనేక  విషయాలలో సంప్రతిస్తుంటారని  ఆయన సన్నిహితులు  చెబుతుంటారు. బీజేపీని 2024 నాటికి  అధికారం నుంచి తొలగించడానికి  ఆయన వామపక్షాలతో చేతులు కలిపే  అవకాశం ఉంది. 

రాజకీయ పాఠాలు
వాస్తవానికి గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి గణనీయంగా మెరుగుపడినప్పటికీ, 2019 ఎన్నికల్లో విజయం సాధించాలంటే మాత్రం అది శిఖరాలు ఎక్కాల్సిందే. ఈ ఎన్నికల ద్వారా ఆయన ఓ గుణపాఠం నేర్చుకున్నారు. అది: కేవలం ప్రత్యర్థుల బలహీనతలు, లోటుపాట్ల మీద ఆధారపడితే ప్రయోజనం లేదు. తమకు తాముగా ఓటర్లను ఆకట్టుకోవడానికి వ్యూహాలు రూపొందించుకోవాలి. ముఖ్యంగా పట్టణ ఓటర్లను ఆకట్టుకోగలగాలి. కేవలం వ్యతిరేక ఓటుతో గెలవాలనుకోవడం జరిగే పని కాదు. అంతేకాక, అవినీతి మచ్చపడిన  కొందరు సీనియర్  కాంగ్రెస్ నాయకులను దూరం పెట్టాల్సి ఉంది. పార్టీలో కొత్త రక్తం ప్రవహించాల్సి ఉంది. ఒక ఏడాది పాటు పూర్తిగా పార్టీ ప్రక్షాళన కార్యక్రమం చేపడితే తప్ప ఇది సాధ్యమయ్యే విషయం కాదు. ఇందిరా గాంధీ, నరేంద్ర మోదీల మాదిరిగా ఆయన ఆకర్షణీయైమెన నినాదాలను కొన్నిటిని సృష్టించాల్సిన అవసరం కూడా ఉంది. ఇందిరా గాంధీ రోటీ కపడా ఔర్ మకాన్, గరీబీ హటావో వంటి నినాదాలతో విజయాలు సాధించారన్న విషయాన్ని ఆయన గమనించడం మంచిది. నరేంద్ర మోదీ అటువంటి నినాదాలు సృష్టించడంలో సిద్ధహస్తులు. ఆయన ఆదాయం, ఉద్యోగాలు, న్యాయం, నిజాయతీ వంటి అంశాలతో నినాదాలను రూపొం దించడం మంచిది. ఆశయాలు, అభివృద్ధిని ఊతంగా చేసుకుని నినాదాలను రూపొందించాల్సి ఉంటుంది. ఇందిరా గాంధీ సృష్టించినట్టే ఓ పది సూత్రాల కార్యక్రమాన్ని సృష్టించి, దాంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటే గ్రామీణ ప్రాంతాలను, రైతాంగాన్ని కలుపుకుని పోవాల్సి ఉంటుంది. గుజరాత్ ఎన్నికలు, రాజస్థాన్ ఉప ఎన్నికలతో రాహుల్ కొంత సానుకూల దిశగా అడుగులు వేశారు. ఈ నినాదాలు, సూత్రాలతో ఈ అడుగుల వేగం పెరిగే అవకాశం ఉంది. అయితే,దీనికంతటికీ, ఓ ఏడాది సరిపోదు. ఇదొక పంచవర్ష ప్రణాళిక.

                                             - జి. రాజశుక

English Title
This is a test period
Related News