ఇళ్లకు చేరుకున్న థాయ్ చిన్నారులు

Updated By ManamThu, 07/19/2018 - 07:55
image
  • 2 వారాలు గుహలో.. వారం ఆస్పత్రిలో..  

imageచియాంగ్ రాయ్(థాయ్‌లాండ్): అత్యంత ప్రమాదకరమైన గుహలో నుంచి నాటకీయ పరిణామాల మధ్య బయటపడిన థాయ్ చిన్నారులు మూడు వారాల తర్వాత క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. రెండు వారాల పాటు గుహలో.. ఆపై బయటికి వచ్చాక ఆస్పత్రిలో గడిపిన చిన్నారులకు ఎట్టకేలకు ఇంటికి వెళ్లేందుకు అనుమతి దొరికింది. చిన్నారుల పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారని తేల్చిన వైద్య బృందం వారిని ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జి చేసింది. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నా.. గుహలో గడిపిన భయానక అనుభవాన్ని సాధ్యమైనంత తొందరగా మరిచిపోయేలా చూడాలని, మీడియాకు ఇంటర్వ్యూలు లాంటివి ఇవ్వడం చేయకూడదని వైద్యులు తెలిపారు.

ఈ మేరకు వారి తల్లిదండ్రులను ఇప్పటికే హెచ్చరించారు. మీడియా ప్రశ్నలతో చిన్నారులు పదే పదే ఆ భయానకimage ఘటనను గుర్తుచేసుకునే ప్రమాదం ఉందని.. దానివల్ల పలు మానసిక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన కావడంతో మీడియాను నిలవరించడం కష్టమని భావించి మధ్యేమార్గంగా తామే ఓ ప్రెస్‌మీట్ పెట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ‘సెండింగ్ ది వైల్డ్ బోర్స్ హోం’ అని వ్యవహరిస్తున్నారు. వైల్డ్ బోర్స్ అనేది ఆ చిన్నారుల ఫుట్‌బాల్ టీం పేరనే విషయం తెలిసిందే! ఈ కార్యక్రమంలో మీడియా ప్రశ్నలకు ఆ చిన్నారులతో పాటు వారి కోచ్ సమాధానాలు ఇస్తారని తెలిపారు. అదే సమయంలో చిన్నారుల మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆచితూచి ప్రశ్నించాలని మీడియాకు వారు విజ్ఞప్తి చేశారు. 

బ్రిటీష్ కేవర్‌కు ఎలన్ మస్క్ క్షమాపణ
థాయ్ గుహలో చిక్కుకున్న చిన్నారులను క్షేమంగా బయటికి తీసుకొచ్చిన టీంలోని ఓ బ్రిటీష్ కేవర్ అన్స్‌వార్త్‌కు టెల్సా సీఈవో  ఎలన్ మస్క్ క్షమాపణ చెప్పారు. ఈ ఆపరేషన్‌లో తన సలహాను తోసిపుచ్చాడనే కోపంతో సదరు కేవర్‌ను అనకూడని మాట అన్నానని, దానికి పూర్తిగా తనదే బాధ్యతంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తన మినియేచర్ సబ్‌మెరైన్‌ను ఉపయోగించాలన్న ప్రతిపాదనను తిరస్కరించినపుడు అన్స్‌వార్త్‌ను తిట్టుకున్నానని, బయటికి కూడా ‘పెడో’ అంటూ తిట్టానని చెప్పారు. పెడోఫెలో(చిన్నారులతో లైంగిక చర్యలకు పాల్పడే వ్యక్తి)ను సంక్షిప్తంగా ‘పెడో’ అంటుంటారు. ఈ విషయంలో తనను క్షమించాలంటూ ఎలన్ మస్క్ బుధవారం అన్స్‌వార్త్‌ను కోరారు.

English Title
THAI BOY THOUGHT HE WAS HALLUCINATING WHEN RESCUER ARRIVED
Related News