త్రివిక్ర‌మ్ చిత్రానికి త‌మ‌న్ సంగీతం?

Updated By ManamTue, 02/13/2018 - 21:14
thaman

thaman'భాగ‌మ‌తి', 'తొలి ప్రేమ‌'.. ఇలా ఈ ఏడాది ఆరంభంలోనే భారీ విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌. ఈ రెండు చిత్రాల‌కి త‌మ‌న్ అందించిన సంగీతం, నేప‌థ్య సంగీతం బాగా ప్ల‌స్ అయ్యింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఖాతాలో నితిన్ 25వ చిత్రం 'ఛ‌ల్ మోహ‌న్ రంగ' ఉంది. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. త‌మ‌న్ ఖాతాలో మ‌రో ఆసక్తిక‌ర‌మైన ప్రాజెక్ట్ చేరింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అదేమిటంటే.. ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రానున్న చిత్రానికి త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక‌య్యాడ‌న్న‌దే లేటెస్ట్ అండ్ హాటెస్ట్ న్యూస్‌.

ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా తొలుత‌ అనిరుధ్ ఎంపికైనా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ స్థానంలోకి దేవిశ్రీ ప్ర‌సాద్ వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే.. త్రివిక్ర‌మ్ మాత్రం త‌మ‌న్‌కే అవ‌కాశ‌మిచ్చారు. దానికి తోడు త్రివిక్ర‌మ్ క‌థ అందించిన 'ఛ‌ల్ మోహ‌న్ రంగ‌'కి కూడా త‌మ‌న్‌నే స్వ‌ర‌క‌ర్త కావ‌డం.. వ‌రుస విజ‌యాలు వ‌స్తుండ‌డంతో.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో త‌మ‌న్‌కు చోటు ద‌క్కింద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్టీఆర్‌, త‌మ‌న్ కాంబినేష‌న్‌లో 'బృందావ‌నం', 'బాద్‌షా' వంటి విజ‌యాలు ఉన్న సంగ‌తి తెలిసిందే.

English Title
thaman music for trivikram's film?
Related News