చెప్పక తప్పదు

Updated By ManamFri, 11/09/2018 - 06:18
rajath-kuamr
  • అభ్యర్థుల నేర చరిత్ర డిక్లరేషన్ తప్పనిసరి

  • తెల్పకపోవడం కోర్టు ధిక్కార నేరమే.. సీఈవో రజత్ కుమార్ వెల్లడి

rajath-kuamrహైదరాబాద్: తెలంగాణ శాసనభకు జరుగుతున్న ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న అభ్యర్ధులు ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించి  సుప్రీం కోర్డు తీర్పుకు అనుగుణంగా నిర్ణీత పద్ధతిలో డిక్లరేషన్ ప్రచురించాల్సి ఉంటుం దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్ రజత్ కుమార్ స్పష్టం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ తేదీ తరువాత రోజు నుంచి పోలింగ్ ముగియ డానికి రెండు రోజుల ముందు వరకు ఈ డిక్లరేషన్ తాలూకు సమాచారాన్ని విస్తృత  ప్రజాదరణ పొందిన వార్తా పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బోల్డు అక్షరాలలో కనీసం మూడు సార్లు అలా ప్రకటించాలన్న సుప్రీంకోర్డు ఆదేశాలకు అను గుణంగా ఆదేశాలను జారీ చేసినట్లు సీఈవో వెల్లడించారు.  పోటీలో ఉన్న అభ్యర్ధులు వారిపై ఉన్న క్రిమినల్ కేసుల సమాచారాన్ని తెలుపుతూ ఫార్మాట్  సీ - 1లో డిక్లరేషన్‌ను, అటువంటి అభ్యర్దులను పోటీకి నిలిపే రాజకీయ పార్టీ ఫార్యాట్ సీ - 2 లో ఇస్తూ డిక్లరేషన్ ప్రచురించవలసి ఉంటుందని ఆయన తెలిపారు. ఫార్మాట్ సీ -2 లోని ఆ డిక్లరేషన్‌ను సదరు రాజకీయ పార్టీలు వారి వెబ్‌సైట్‌లో కూడా ప్రదర్శించడం తప్పనిసరి అని రజత్ కుమార్ తెలిపారు.  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు వారి నేర చరిత్రకు సంబంధించిన డిక్లరేషన్‌ల ప్రచురణ విషయంలో పాటించాల్సిన విధివిధానాలపై కేంద్ర ఎన్నికల సంఘం మరింత స్పష్టతనిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్న 5 రాష్ట్రాలకు  లేఖలు పంపించినట్లు రజత్ కుమార్ వెల్లడించారు. దాని ప్రకారం రాష్ట్రంలో, సంబంధిత నియోజక వర్గంలో విస్తృత ప్రజాదరణ పొందిన వార్తా పత్రికలు, టీవీ ఛానళ్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు సూచన ప్రాయంగా రూపొందించి అభ్యర్దులకు. పార్టీలకు అందుబాటులో ఉంచుతారు. ఒక అభ్యర్దికి తెలియకుండా పత్రికలో, టీవీల్లో అతని పేరున మరొకరు తప్పుడు ప్రకటనలు ప్రచురిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(4), భారత శిక్షాస్మృతిలోని  సెక్షన్ 171 కింద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేర చరిత్ర లేని అభ్యర్ధులు ఎటువంటి డిక్లరేషన్‌లు ప్రచురించాల్సిన అవసరం లేదు. క్రిమినల్ కేసుల విచారణలో ఉన్నా, గతంలో శిక్ష పడి ఉన్నా అటువంటి అభ్యర్ధులు తప్పనిసరిగా డిక్లరేషన్ ప్రచురించాలి.  దీనికయ్యే ఖర్చంతా  అభ్యర్ది లేదా పార్టీకి సంబంధించిన ఎన్నికల ఖర్చుల కింద పరిగణించడం జరుగుతుంది.  డిక్లరేషన్ ప్రచురితమైన తరువాత దాని తాలూకు సమాచారాన్ని అభ్యర్దులయితే ఫార్మాట్ సీ - 4లో, పార్టీలయితే పార్మాట్ సీ - 5లో జిల్లా ఎన్నికల అధికారికి సమర్పిం చవలసి ఉంటుంది. అసలు ఈ డిక్లరేషన్ నిర్ధిష్ట పద్దతిలో ప్రకటించకపోయినా, ప్రచురించ కపోయినా ఎన్నికలు ముగిసిన తరువాత న్యాయ స్ధానాల ముందు  విచారణకు వెళ్లే ఎన్నికల పిటీషన్‌లలో ప్రతికూలతలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. దానికంటే ఎక్కువగా కోర్డు ధిక్కార నేరం మోపుతామని సీఈవో తెలియచేశారు.

నేడు రాజకీయ పార్టీలతో కీలక భేటీ
తెలంగాణ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ 12న విడుదల కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ శుక్రవారం రాజకీయ పార్టీలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి, నామినేషన్ల దాఖలు, రాజకీయ పార్టీలు, అభ్యర్దులు పాటించవలసిన మార్గదర్శకాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ఇప్పటి వరకు లెక్కలు చూపని నగదును రూ. 65 కోట్ల వరకు పోలీసులు స్వాధీనం చేసుకోవడం పట్ల అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరో రూ. 5 కోట్ల విలువైన మధ్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నవంబర్ 12 నుండి నామినేషన్ల దాఖలు పర్వ ప్రారంభమవుతుందని, డిసెంబర్ 5 వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించుకొనే అవకాశం ఉన్నందున అక్రమ డబ్బు రవాణా, మద్యం సరఫరా పైన నిఘాను కట్టుదిట్టం చేస్తున్నామని పేర్కొన్నారు.  అభ్యర్దులు వ్యయం చేయాల్సిన మొత్తంతో పాటుగా పాటించవలసిన నియమాలు అత్యంత ప్రధానం అని తెలియచేశారు. ధన ప్రవాహాన్ని నియంత్రించడంతో పాటుగా కేసులు వ్యవహరం కూడా పత్రికల్లో ప్రకటించే అంశంపై స్పష్టత ఇవ్యబోతున్నామని తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ శాతం పెంచేందుకు ప్రచారం ముమ్మరం చేశామని తెలిపారు. ఓటర్లకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులే పోలింగ్‌కు మూడు నాలుగు రోజుల ముందే ఓటరు స్లిప్‌లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

English Title
That's right
Related News