అందుకే చాహల్ అద్దాలు పెట్టుకుంటాడు

Updated By ManamWed, 02/21/2018 - 00:30
Yuzvendra-Chahal

కారణాలు వివరించిన యజ్వేంద్ర తండ్రి
Yuzvendra-Chahalముంబై: టీమిండియా లెగ్ బ్రేక్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ ఫీల్డింగ్ సమయంలో అద్దాలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 లో చాహల్ అద్దాలు పెట్టుకున్నాడు. దీనిపై హరియాణాలోని అతని తండ్రిని అడిగితే ముందస్తు జాగ్రత్తగా ధరిస్తున్నాడని ఆయన చెప్పారు. ‘సౌతాఫ్రికా పర్యటనకు ముందు కంటి డాక్టర్‌ను కలిశాం. అప్పుడప్పుడు అద్దాలు పెట్టుకోమని డాక్టర్ సూచించారు. బౌలింగ్, బ్యాటింగ్ సమయాల్లో పెట్టుకోడు. కానీ ఒక్క ఫీల్డింగ్ సమయంలో మాత్రమే పెట్టుకుం టాడు. అతనికి చూపు మాంద్యం లేదు. కానీ ప్రభుత్వ మెడికల్ టెస్టుకు వెళ్లినప్పుడు అద్దాలు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. అందుకే అవి పెట్టుకుంటున్నాడు’ అని చాహల్ తండ్రి వివరించారు. ఆదాయపు పన్ను శాఖలో చాహల్‌కు ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం లభించిందని.. సౌతాఫ్రికా పర్యటన నుంచి రాగానే అందులో చేరతాడని ఆయన తెలిపారు.

English Title
That's why Chahal loves glasses
Related News