నాడు 'ముఖ్య‌మంత్రి'.. నేడు 'భ‌ర‌త్ అనే నేను'..

Updated By ManamTue, 04/17/2018 - 15:51
bharathanenenu

ban''విర‌చిస్తా నేడే న‌వ శ‌కం.. నిన‌దిస్తా నిత్యం జ‌న‌హితం.. న‌లుపెర‌గ‌ని సేవే అభిమ‌తం.. క‌ష్టం ఏదైనా స‌మ్మ‌తం.. భ‌ర‌త్ అనే నేను - హామీ ఇస్తున్నాను.. బాధ్యుడినై ఉంటాను.. ఆఫ్ ద‌ పీపుల్‌.. ఫ‌ర్ ద‌ పీపుల్‌.. బై ద పీపుల్ ప్ర‌తినిధిగా..'' అంటూ ముఖ్య‌మంత్రి భ‌ర‌త్ రామ్ పాత్ర‌లో సంద‌డి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు సూప‌ర్ స్టార్‌ మ‌హేశ్ బాబు. ముఖ్య‌మంత్రి పాత్ర‌లో ఆయ‌న మొద‌టి సారిగా న‌టించిన ఆ చిత్ర‌మే 'భ‌ర‌త్ అనే నేను'. 'శ్రీ‌మంతుడు' వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత మ‌హేశ్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ సినిమా.. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 20న విడుద‌లకు ముస్తాబవుతోంది. 

banఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఆ రోజు మ‌హేశ్ అమ్మగారు ఇందిర‌మ్మ పుట్టిన‌రోజు కూడా కావ‌డం. అమ్మ పుట్టిన‌రోజుని పుర‌స్క‌రించుకుని.. త‌న సినిమా విడుద‌ల‌వ‌డానికి మించిన గొప్ప సంద‌ర్భం లేదంటూ తాజాగా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో మ‌హేశ్ ఒకింత భావోద్వేగంతో చెప్ప‌డం అంద‌ర్నీ క‌దిలించింది. ఇందిర‌మ్మ పుట్టిన‌రోజుతో పాటు మ‌రో విష‌యం కూడా 'భ‌ర‌త్ అనే నేను' చిత్రానికి యాదృచ్ఛికంగా ముడిప‌డింది. అదేమిటంటే.. గ‌తంలో 'ముఖ్య‌మంత్రి' అనే టైటిల్‌తో మ‌హేశ్ తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన సినిమా కూడా ఏప్రిల్‌లోనే రిలీజ్ అయ్యింది. 1984 ఏప్రిల్ 27న ఆ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. వాస్త‌వానికి 'భ‌ర‌త్ అనే నేను' చిత్రాన్ని కూడా తొలుత‌ ఏప్రిల్ 27న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల విడుద‌ల తేదిని ఒక వారం ముందుకు జ‌రిపారు.  ఒక‌వేళ 'భ‌ర‌త్ అనే నేను' కూడా ఏప్రిల్ 27నే రిలీజ్ అయ్యేట‌ట్ల‌యితే.. ముఖ్య‌మంత్రి పాత్ర‌లో తండ్రీకొడుకులు న‌టించిన సినిమాలు రెండూ ఒకే నెల‌లో.. ఒకే తేదిన విడుద‌లైన అరుదైన సంద‌ర్భంగా నిలిచేది.

ఏదేమైనా.. తండ్రి ముఖ్య‌మంత్రి పోషించిన 34 సంవ‌త్స‌రాల‌కు.. కొడుకు అదే త‌ర‌హా పాత్ర చేయ‌డం.. ఇది కూడా ఏప్రిల్ నెల‌లోనే విడుద‌ల‌వుతుండ‌డం.. దానికి ప్రేక్ష‌కుల్లో విప‌రీత‌మైన క్రేజ్ రావ‌డం ఆస‌క్తిక‌రం.  కాక‌పోతే.. 'ముఖ్య‌మంత్రి' అనే పోలిక త‌ప్ప ఆ చిత్రానికి.. 'భ‌ర‌త్ అనే నేను' చిత్రానికి క‌థ ప‌రంగా, క్యారెక్ట‌ర్స్ ప‌రంగా ఎలాంటి పోలిక‌లు ఉండ‌వు. అలాగే 'ముఖ్య‌మంత్రి'.. క‌న్న‌డంలో 'చక్ర‌వ్యూహ' (1983) పేరుతో విడుద‌లై.. హిందీలో 'ఇంక్విలాబ్' (1984) పేరుతో రీమేక్ అయిన సినిమాకు రీమేక్ అయితే.. 'భ‌ర‌త్ అనే నేను' స్ట్ర‌యిట్ ఫిల్మ్‌. 'ముఖ్య‌మంత్రి' చిత్రానికి విజ‌య నిర్మ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. 'భ‌ర‌త్ అనే నేను' చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కృష్ణ 41 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ముఖ్య‌మంత్రి పాత్ర‌ను చేస్తే.. మ‌హేశ్ 42 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఈ పాత్ర‌ను చేయ‌డం విశేషం. అలాగే.. రెండు చిత్రాల్లోనూ అసెంబ్లీ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలే సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో.. మ‌హేశ్ 'ముఖ్య‌మంత్రి భ‌ర‌త్ రామ్' పాత్ర‌లో ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటారో అని అభిమానుల‌తో పాటు స‌గటు ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.                                                                   

                                                                                               -మ‌ల్లిక్ పైడి

English Title
then 'mukhyamantri', now 'bharath ane nenu'
Related News