నాణ్యమైన కోచ్‌లు లేరు: గోపీచంద్

Updated By ManamFri, 09/21/2018 - 23:22
gopichand

gopichandదేశంలో నాణ్యమైన బ్యాడ్మింటన్ కోచ్‌లు లేరని జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ‘ఇండియాలో నాణ్యమైన కోచ్‌లు లేరు. ఇది అంతర్జాతీయ స్థాయిలో మనకు హాని చేస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ కోచ్‌లను తయారు చేసుకునేందుకు మనకంటూ ఒక సిస్టం లేదు. మొత్తం నిర్మాణంలో మౌలిక సదుపాయాల నిర్మాణం చాలా సులభతరమైంది. కానీ క్రీడాభివృద్ధికోసం అంకుటిత దీక్షతో, సుదీర్ఘ కాలం ప్లేయర్స్‌కు ప్రేరణనిస్తూ పనిచేయడమనేది చాలా కష్టమైన పని’ అని గోపీచంద్ చెప్పారు. క్రీడల్లో అభివృద్ధి చెందే సామర్థ్యం మనకుందని.. కానీ పోటీతత్వ కోచ్‌లను తయారు చేసుకోవాల్సిన అవసరముందని ఆయన అన్నారు. నాణ్యమైన కోచ్‌లు లేనంత వరకు నాణ్యమైన ప్లేయర్స్‌ను తయారు చేయలేమని గోపీచంద్ చెప్పారు.

Tags
English Title
There are no quality coaches: Gopichand
Related News