అసెంబ్లీలో ప్రతిపక్షం లేక 'కిక్' లేదు

Updated By ManamTue, 03/13/2018 - 14:30
Somireddy

Somireddy అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేక కిక్ లేదని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీని మళ్లీ విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని.. చెప్పినట్లు వినకుండే రాష్ట్రాన్ని విడదీస్తామన్నట్లు బీజేపీ మాట్లాడుతోందని విమర్శించారు. ఒక ఓటుకు రెండు రాష్ట్రాల సిద్ధాంతాన్ని బీజేపీ తెరపైకి తెస్తోందని ఆయన మండిపడ్డారు.

ఇక ఆర్థిక నేరగాళ్లకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఎలా ఇస్తారని.. జగన్‌కు ఇచ్చినట్లే నీరబ్ మోదీకి ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తారా అంటూ ప్రశ్నించారు. అలాగే దక్షిణ, ఉత్తర భారతదేశం అని చంద్రబాబు అనడంలో తప్పులేదని.. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపొద్దని మాత్రమే కోరుతున్నామని పేర్కొన్నారు. ఇక బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీ రాష్ట్రానికి ద్రోహం చేస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

English Title
There is no kick in AP assembly without Opposition
Related News