చంద్రబాబుతో పంచాతి లేదు

ktr
  • ఆయనో గల్లీ లీడర్.. ఏపీలోనూ రాజకీయాలు చేస్తం

  • దేశానికి కేసీఆర్ అవసరం చాలా ఉంది

  • తెలంగాణకు మరో పది,పదిహేనేండ్లు మా నేతే సీఎం 

  • అభివృద్ధి, సంక్షేమం టీఆర్‌ఎస్ ప్రభుత్వ జోడెడ్లు

  • తెలంగాణ అభివృద్ధి దేశానికే రోల్ మోడల్ కావాలి

  • వందేండ్లు పటిష్టంగా ఉండేలా పార్టీని బలోపేతం చేస్తా

  • 75 శాతం సీట్లిచ్చి ప్రజలు గురుతర బాధ్యత పెట్టిండ్రు

  • 16 ఎంపీ స్థానాల్లో గెలిచి కేంద్రాన్ని శాసిస్తాం 

  • వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలిసారి మీట్ ద ప్రెస్‌లో కేటీఆర్ 

హైదరాబాద్: ‘చంద్రబాబుతో మాకు వ్యక్తిగతంగా గెట్టు పంచాయతీ లేదు.. అయితే, ఏపీకి ఎవరు నాయకుడైతే మంచిదనేదే తాము అక్కడి ప్రజలకు చెబుతాం’ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. అందుకే తాము ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు.  తమ నేత కేసీఆర్ నాయకత్వం తెలంగాణకు మరో పది,పదిహేనేండ్లు అవసరమని నాతో సహా టీఆర్‌ఎస్ శ్రేణులంతా కోరుకుంటున్నాయని చెప్పారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని ఆయన అన్నారు.సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ద ప్రెస్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పెద్ద నాయకుడు కాదని...ఆయన ఒక గల్లీ నాయకుడు అంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో బలమైన శక్తిగా ప్రాంతీయ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు.అభివద్ధి, సంక్షేమం మా జోడెడ్లు అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి దేశా నికే ఒక రోల్ మోడల్ కావాలని ఆయన పిలుపుని చ్చారు. దేశ రాజకీయాలను మార్చే శకి.. బుద్ధి, బలం ఉంది.., కావాల్సినంత సమయమూ ఉంది. ఏపీకి ఎప్పుడు వెళ్లాలనేది సరైన సమయంలో నిర్ణయిస్తామని వ్యాఖ్యానించారు. తాము కంగారు పెట్టే వాళ్ళమే తప్ప, కంగారు పడే వాళ్ళం కాదన్నారు. లగడపాటికి గతంలోనే రాజకీయ సన్యాసం చేయించామని, ఇపుడు సర్వే సన్యాసం కూడా చేయించామని అన్నారు. పన్నెండేండ్ల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరిన నాపై గురుతర బాధ్యత అప్పగించిన కేసీఆర్‌కు పాదాభి వందనం అంటూ.. ప్రసంగం మొద లు పెట్టిన కేటీఆర్ అనేక విషయాలపై స్పందించారు.దాదాపు 2కోట్లమంది ఓటింగ్‌లో పాల్గొంటే..98లక్షల ఓట్లు టీఆర్‌ఎస్‌కు వచ్చా యన్నారు. ద్వితీయ స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కు 48 లక్షల ఓట్ల తేడా ఉందన్నారు. మా పార్టీకి 47 శాతం ఓట్లు వచ్చాయన్నారు. అందుకే ఇది అసాధారణ విజయమన్నారు. చిరస్మరణీయ విజయాన్ని ప్రసాదించిన ఓటర్లకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఎంత బలంగా ఉన్నారో ఈ  ఫలితాలు నిరూపించాయన్నారు. ప్రజలకు, టీఆర్‌ఎస్‌కు ఉన్న విడదీయరాని బంధమే ఈ అద్భుత విజయానికి కారణమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, తాను ముందుగా చెప్పినట్టే బీజేపీకి వందకు పైగా స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయ న్నారు. అదే విధంగా ఎన్నికల్లో గెలిస్తేనే.. ప్రెస్ క్లబ్‌కు వస్తానని చెప్పాను.. చెప్పినట్లే టీఆర్‌ఎస్‌ను గెలిపించి వచ్చానన్నారు. 

ఇక, ప్రతి పక్షాలు తమకు తాముగా సృష్టించుకున్న మాయ లోకంలో పడ్డాయని గుర్తు చేశారు. తెలంగాణలో ఈవీఎంల ట్యాంపరింగ్ అని కాంగ్రెస్ చవకబారుగా విమర్శలు చేస్తోందని...కాంగ్రెస్ గెలిచిన అ మూడు రాష్ట్రాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని కేటీఆర్ హమీ ఇచ్చారు. వారసత్వం రాజకీయాల్లో ఓ ఎంట్రీ పాస్ లాగే పనికొస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వందేండ్ల పాటు పార్టీ పటిష్టంగా ఉండే ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే తెలంగాణ కేంద్రాన్ని శాసించే స్థితిలో ఉంటుందన్నారు. మహిళలకు పార్టీ కమిటీల్లో తప్పని సరిగా ప్రాధాన్యత నిస్తామని ఆయన వెల్లడించారు. టీఆర్‌ఎస్ శ్రేణులు యుద్దాన్ని ఆపకుండా అనుకున్న గమ్యం చేరుకునే దాకా పోరాటాలు చేయాల న్నారు. కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వాన్ని మార్చ గలం.. దించగలం అని భావిస్తున్నాయని..కానీ, ప్రజలు తలచుకుంటే తప్ప అది జరగబోదన్నారు. ఇకనైనా ఆ మీడియా సంస్థలు పునరాలోచన చేసుకోవాలనీ కేటీఆర్ సూచించారు. దేశం బలోపేతం కోసం మా ఫెడరల్ ఫ్రంట్ అయితే .. సొంత పార్టీ మనుగడ కోసం చంద్రబాబు ఫ్రంట్ అని చమత్కరించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో టీడీపీ పాత్ర పెద్దగా ఉండక పోవచ్చంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసినా ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదని ఆయన జోస్యం చెప్పారు. ప్రభుత్వంలో తాను ఉండాలా? వద్దా? అనేది పూర్తిగా సీఎంకు సంబంధించిన నిర్ణయమని ఆయన తెలిపారు. విద్యార్ధి రాజకీయాల నుంచి వచ్చిన వారికి పార్టీలో సముచిత ప్రాధాన్యమిచ్చిందని వెల్లడించారు. ప్రభుత్వం వాగ్ధానాలు సరిగా అమలు చేసేలా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కృషి చేస్తానని ఆయన చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి టీఆర్‌ఎస్ మేనిఫెస్టో లో పెట్టినవన్నీ చేస్తామని చెప్పారు. అవసరమయితే పార్లమెంటు సీట్లు పెంచయినా మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేననేది కేసీఆర్ అభిప్రాయమన్నారు. తెలంగాణలో సీఎం సీటు ఖాళీగా లేదని..అయినా అ సీఎం పదవిపై నాకు ఆశ లేదని..మరో ఇరవై ఎళ్లు కేటీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని కేటీఆర్ కరాఖండీగా చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మీడియా కూడా తన పరిధిని దుర్వినియోగం చేయకూడదని ఆయన సూచించారు. కేసీఆర్‌ను ఎవరు తిట్టినా కూడా ప్రచురించడం,ప్రసారం చేయడం మంచిదా? అని మీడియా ప్రతినిధులను, యాజమాన్యాలను ప్రశ్నిం చారు. రాహుల్ గాంధీని నేను ప్రచురించని భాషలో తిటినా కూడా మీడియా ప్రచురించ కూడదని ఆయన సూచించారు. అన్నింటికన్నా ముఖ్యంగా చిన్న పిల్లలను కూడా చెడ గొట్టేలా మీడియా ప్రవర్తించ కూడదని కేటీఆర్ సుతి మెత్తగా మందలించారు.

Tags

సంబంధిత వార్తలు