అక్కడ ఆకాశం ఉండదు .,

Updated By ManamSun, 04/15/2018 - 02:55
imege

imageఆ రోజు.. లేత శీతాకాలపు పురిటి రాత్రి  చంద్రోదయ వేళ ఆకాశంలోకి చూసున్నానా అప్పటిదాకా నొప్పితో సలుపుతున్న హృదయం చుట్టూ పునఃసృజించబడ్తున్న ఏదో కొత్త తూర్పుగాలి..  నిశ్శబ్ద వేణుగానమై ముసురుకుంది   ఎవరూ లేరు ప్రక్కన కాని ఒక పెద్ద సమూహం.. లోపలా బయటా loud thinking washes out the mushy లోపల సలసల మసులుతున్న ద్రవజీవితంపై  తెట్టు.. the slog .. ఏదో మలిన స్పర్శ తాలూకు పొర కవిత తన రూపాన్ని మార్చుకుంటూ ముజ్రాగా, కవ్వాలీగా , గజల్‌గా  అవధాన గానంగా అక్షరాలు సంగీతాన్ని కూర్చుకుని  అప్పటిదాకా వెన్నెల్లో నిశ్శబ్దంగా నిలబడ్డ గుబురు చింతచెట్టులోనుండి వందల పక్షులు విస్ఫోటిస్తూ రెక్కల లయాత్మక ధ్వని ఎవరు అనువదించగలరు సంగీతాన్ని ఏ భాషలోకైనా మనిషి కరిగిపోవడానికి రవ్వంత అగ్నిస్పర్శ చాలుకదా అది అందగానే .. యిక లోయల్లోకి ఎగిరిపోతాను తీరా ఏమిటీ అంటే .. ఒక రసానుభవంకోసం తండ్లాట- చంద్రుడు ఆకాశాన్ని తవ్వుతూ వెళ్తూంటే యుగయుగాల కవితలు .. దేశదేశాల కవుల సర్వమానవానుభవాలుగా  స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్, మెక్సికన్ .. ఎవరైతేనేమి  మనుషులందరి ఆత్మ పరివేదనా, స్వేచ్ఛాకాంక్షా ఒక్కటేకదా అన్నీ వెన్నెల తుఫాన్లై వెల్లువెత్తుతాయి భాష  ఓడిపోయి పురామానవులంతా ఒక హృదయద్రవ్యమై .. అంతా సార్వత్రిక  ఏకబహుళత కళ్ళు మూసుకుంటే దేశదేశాల వ్యవసాయాలు, కార్ఖానాలు, యుద్ధాలూ, రక్తసిక్త రాజ్యాల రాచవీధులు.. శవరాశులు  కుప్పలుతెప్పలుగా విద్యుదయస్కాంత తరంగాల  ఆల్ట్రా ఇంటర్ ఫియరెన్స్ .. వ్యతికరణ సంక్షోభ బీభత్సాలు  మనిషిని వెదుక్కుంటూ వెదుక్కుంటూ వెళ్తున్నపుడు ఏ ఆఫ్రికా అడవుల్లోనో ఒక కవిత దొరుకుతుంది మానవజాడతో పాటు కొన్ని అక్షర ముద్రలు కనిపిస్తాయి అతి నీలలోహిత ప్రజ్వలన వెంటపడి  ఆనవాళ్లను గుర్తిస్తూ గుర్తిస్తూ  నడుస్తున్నకొద్దీ చంద్రున్ని అనుసరిస్తూ పోతూ పోతూంటే ఎక్కడో ఒక సూర్యుడు దొరుకుతాడు ఐతే అక్కడ ఆకాశం ఉండదు ఒట్టి భూమి మాత్రమే ఉంటుంది
- రామా చంద్రమౌళి   
9390109993

Tags
English Title
There is no sky there.
Related News