ఎగవేత వీరులు వీరే

Updated By ManamSat, 08/04/2018 - 00:47
vijay mallya
  • 28 మంది ఎగవేతదారుల పేర్లు వెల్లడి

  • అందరికీ పెద్దన్న మాల్యా.. జాబితాలో నీరవ్.. మెహుల్

  • రుణాల ఎగవేత.. ఆపై పరారీ.. విదేశాలకు ఆర్థిక నేరస్తులు

  • కొందరికి అక్కడి పౌరసత్వం.. జాబితా తెలిపిన ఆర్థిక శాఖ

vijay న్యూఢిల్లీ: బ్యాంకులకు టోపీ పెట్టి.. వాటి నుంచి పెద్దమొత్తంలో అప్పులు తీసుకుని పారిపోయినవారందరికీ పెద్దన్న విజయ్ మాల్యానే అని తేలింది. ఎగవేతదారులకు తనను పోస్టర్‌బోయ్‌గా చేసేశారని ఆయన ఎంత మొత్తుకున్నా.. అత్యధిక మొత్తం తీసుకుని పరారీలో ఉన్నది మాల్యానే అన్న విషయం కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబితాలో వెల్లడైంది. మాల్యా దాదాపు రూ. 7,500 కోట్ల మేర (దీనిమీద వడ్డీలు అదనం) బ్యాంకులను మోసం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ లోక్‌సభకు అందించిన జాబితాలో తెలిపింది. ఆయన తర్వాత వజ్రాల వ్యాపారులు మెహుల్ చోక్సీ రూ. 7080 కోట్లు, నీరవ్ మోదీ రూ. 6498 కోట్ల మేర మోసం చేశారు. వీరిలో చోక్సీ గీతాంజలి జ్యూవెల్స్ ప్రమోటర్ కాగా, నీరవ్ మోదీకి తన పేరుతోనే సొంత లగ్జరీ డిజైనర్  జ్యూవెలరీ బ్రాండ్ ఉంది. వీరితర్వాత స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లు చేతన్ సందేసరా, నితిన్ సం దేసర, దీప్తిబెన్ సందేసరా ఉన్నారు. వీళ్లు దాదాపు రూ. 5,383 కోట్లు ఎగ్గొట్టారు. రూ. 5 వేల కోట్ల మనీలాండరింగ్ కేసులో వీళ్ల ఫార్మాకంపెనీకి చెందిన రూ. 4,701 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేసింది. ఆ తర్వాతి స్థానంలో విన్సమ్ డైమండ్స్ ప్రమోటర్ జతిన్ మెహతా ఉన్నారు. ప్రస్తుతం ఈయన కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ పౌరసత్వం పొంది ఉన్నారు. ఆయన బ్యాంకులను రూ. 4,625 కోట్ల మేర మోసం చేశారు. ఇంకా.. కోల్‌కతాకు చెందిన శ్రీ గణేశ్ జ్యూయలరీ హౌస్ ప్రమోటర్లు నీలేష్ పారేఖ్, ఉమేష్ పారేఖ్, కవులేష్ పారేఖ్ కూడా రూ. 2,672 కోట్ల మోసంతో జాబితాలో ఉన్నారు. 

పూర్తి జాబితా ఇదీ..
విజయ్ మాల్యా, జతిన్ మెహతా, పుష్పేశ్ బైద్, చేతన్ జయంతిలాల్ సందేసరా, నితిన్ జయంతిలాల్ సందేసరా, దీప్తిబెన్ చేతన్‌కుమార్ సందేసరా, ఏకలవ్య గార్గ్, సంజయ్ కుమార్ కల్రా, సబ్య సేథ్, రాజీవ్ గోయల్, అల్కా గోయల్, సన్నీ కల్రా, ఆర్తి కల్రా, వర్షా కల్రా, సుధీర్ కుమార్ కౌరా, సురేందర్ సింగ్, అంగద్ సింగ్, హర్‌సాహిబ్ సింగ్, హర్లీన్ కౌర్, వినయ్ మిట్టల్, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ 

English Title
These are the default invoices
Related News