ఇవి ‘పరువు’ హత్యలు కాదు ‘మనువు’ హత్యలు!!

Updated By ManamSat, 09/22/2018 - 01:13
B. R. Ambedkar

imageక్రూరమైన మనుధర్మం మనలోని మానవీయ తని నాశనం చేసి మనుషుల్ని కులాల పేరుతో ఇలాంటి నేరాలకు వుసిగొల్పుతుంది. ఇవి ఆవేశంతో అప్పటికప్పుడు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు కాదు. అందుకే ఈ దుర్మార్గుల మాటల్లో కనీసం పశ్చాత్తాపాన్ని కూడా చూడలేం. వీరి హృదయంలో కుల క్రూరత్వం తప్ప మరొకటి వుండదు. వీళ్ళు కడుపు తీపి తెలియనవాళ్ళూ కాదు. మనస్సునిండా మనువాదాన్ని, తనువునిండా కుల దురంహంకారాన్ని నింపుకొని మనువు మంత్రించి వదిలిన మహామృగాలు వీళ్ళు.

అంబేడ్కర్ తోనే మొద లు పెడదాం -
‘హిందువుగా పుట్టినా, హిందువుగా మరణించను’ అని ప్రక టించిన అంబేడ్కర్ - హిందూ మత గ్రంథా లన్నింటినీ మరే హిందూ పండితుడు చేయనంతగా అధ్యయనం చేశాడు. హిం దూ పరిభాషలో చెప్పాలంటే ఔపోశన పట్టాడు. కా నీ... ఆయన ‘వేదాల్ని తగలబెట్టలేదు. ఉపనిషత్తులకి మంట పెట్టలేదు. షడ్దర్శనాలని చించి కుప్పలో పోయ లేదు. ఒక్క మనుధర్మ శాస్త్రాన్ని మాత్రమే తగుల బెట్టాడు. దాన్నే ఎందుకు తగలబెట్టాడు? అనేది ఇన్నే ళ్ళుగా చాలామంది మేధావులకు కూడా అంతుబట్ట లేదు. ‘అసలు సిసలు’ మేధావులం అనుకునే వారికి అంతుబట్టదు కూడా. ఎందుకు తగులబెట్టాడో... ఇటీ వల కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులపై జరిగిన హత్యాయత్నాల్ని చూస్తే అర్ధమవుతుంది. ‘మనువు’ వల్ల భారతీయ సమాజానికి ఎంత పెనుముప్పు వుందో! మానవీయతకు మనుధర్మ శా స్త్రం ఎంతదూరంలో వుంటుందో ఇటీవల జరుగు తు న్న, గతంలో కంటే పెరిగిపోయిన ఎన్నెన్నో దురం తా లు తేటతెల్లం చేస్తున్నాయి. హింసా, అమానుషం అనే వి మనువాదానికి బొమ్మాబొరుసు! అంతే... దాని మరో ముఖమే లేదు.

‘ఇక్కడ మనిషిని పశువుకంటే పరమహీనంగా, హేయంగా తయారుచేసి, ఉన్మాదంలో ముంచగలి గిం ది ఒక్క మనుధర్మం మాత్రమే’ అని అంబేడ్కర్ ఖచ్చితంగా గుర్తించాడు. అందుకే.. కులం పైనే కత్తిగ ట్టాడు. కదనశంఖం పూరించాడు. ‘కుల నిర్మూలనా’ దృక్పథం వున్న వాళ్ళకే మనువు మనువుగా అర్థమవు తాడు. ఆ గాడితప్పి ఆలోచించే వాళ్ళకి అప్పుడప్పుడూ మనువు కూడా ‘మన వాడిగానే’ కనిపిస్తూ వుంటాడు. మను భావజాలం ఎంత ప్రభావం చూపుతుం దంటే అది మనిషిలోని పశువుని నిద్రలేపుతుంది. తన పిల్లల్ని తానే నిర్దాక్షిణ్యంగా తినేసే పాముకంటే పరమహీనంగా, క్రూరంగా తయారు చేస్తుంది. ఇదే మారుతీరావు, ఇదే మనోహరాచారిలు ఈ మనుధ ర్మం సృష్టించిన ‘కులం’ లేని సమాజాల్లో పుట్టివుంటే తమ బిడ్డల్ని తామే బలితీసుకునే వాళ్ళా? ఇది ముం దుగా మనం ఆలోచించాల్సిన విషయం. మిర్యాల గూడ ప్రణయ్ విద్యావిహీనుడు కాదు. కురూపి కా దు. నిరుపేదా కాదు. కులానికి మాత్రమే ఎక్కువ కాదు. ఆ ఒక్కటీ తప్ప.... కాబట్టి ఈ కుల హింసా ఉన్మాద రోగం  ఒక్క మారుతీరావులోనే లేదు, వైదిక భావజాలంలోనే వుంది అనేది పచ్చినిజం. వైదిక సంస్కృతిగానీ, దానికి శాసనాలు రూపొందించిన మను ధర్మం గానీ... ‘కులాన్ని’ ఎంత బలమైన చట్రంగా రూపొందించాయో అర్ధంచేసుకోవాలి. దానికి ఈ దేశంలో ఎన్నో వందల సంఘటనలు మనముందు సాక్ష్యంగా నిలబడతాయి. వాటిని ఒప్పుకోవాలి.
 
కులం లేనివాడు మనిషేకాదు 
వైదిక భావజాలంలో... మనిషి, మానవుడు అంటేనే ‘మనువుకు’ సంబంధించిన వాడని వుంది. 
‘మనోరపత్యాని మనుష్యా’ అంటే ... మనువు సంతానం కనుక మనుష్యుడు అని దీనర్ధం. 
‘మనోద్ఘాత్ణా మనుజ్ణా’ అంటే... మనువు వల్ల పుట్టినవాడు మనుజుడు అని దీనర్ధం. 
‘మనో రిమో మానవ్ణా’ అంటే ... మనువుతో సంబంధం కలవాడు మానవుడు అని దీనర్ధం.
‘మనిషి’ అంటే మనువుకు సంబంధించినవాడని వైదికధర్మం పదేపదే చెప్పింది. అంటే మనువు చెప్పిన ధర్మశాస్త్రాన్ని తూ.చ. తప్పక పాటించాలి, అదే మాన వధర్మం అని తల్లి గర్భంలో నుండే ఈ తత్త్వాన్ని ఈ దేశం తలకెక్కించింది. కులం పశ్చిమదేశ ప్రజల్ని వైదిక గ్రంథాలు ‘మ్లేచ్ఛులు’ అని నీచంగా పిలిచాయి. మ్లేచ్ఛులు అంటే మురిగ్గా ఉండేవారు, శుభ్రత ఎరగని వారు అని బొంకుతారు ఇప్పుడు కొందరు. కానీ, సనాతన వైదిక గ్రంథాలు మాత్రం మ్లేచ్ఛులు అంటే కులశుద్ధి లేనివారు, కులపరమైన అంటు లేనివారు అనే చెప్పాయి. అంటే.. మనువాదం దృష్టిలో కులం లేనివాడు మనిషే కాదన్నమాట. ఈ దేశాన్ని అనైక్యంగా, అమానుషంగా తయారు చేసిందే కులవ్యవస్థ. ఇది ఒక వాస్తవం. దీన్ని కప్పిపు చ్చుకోడానికీ, హిందూశక్తులు ఇప్పుడు తీవ్రంగా ప్ర యత్నిస్తూ వుంటాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ దేశ సమగ్రతకు భంగం కలిగించేవి ‘మత సమ స్యలు, ప్రాంతీయ విభేదాలే ప్రధాన కారణం. వాటి వల్లే ముప్పు’ అని వాటినే చూపెడతాయి. నిజానికి వి వాహాల విషయంలో మతాంతర వివాహాల కంటే ... కులాంతర వివాహాలే ఈ దేశంలో ఎక్కువ రక్త పాతం సృష్టించాయనేది అందరికీ తెలిసిన సత్యమే! 

పెళ్లిని కూడా మనువాడటం అంటారు    
పెళ్ళికి ‘మనువు’ అనే మరో పేరు వుంది. దీన్ని ‘మనువాడటం’ అంటాం. అంటే మనువు చెప్పిన ధర్మశాస్త్రం ప్రకారం కలసి నడవడం అనే దీని భావం. అంటే ‘కులం’ కట్టుబాటు తప్పక పాటించేదే ‘మనువు’ (పెళ్ళి) అని. వైదిక మనుధర్మ శాస్త్రం చెప్పేది ఇదే! ఈ కట్టుబాటును తప్పడం ధర్మవిరుద్ధం. కాబట్టి ఆ ‘ధర్మాన్ని’ రక్షించడానికి, కన్నబిడ్డనైనా కడతేర్చి ఆ రక్తంతో మనుధర్మానికి తర్పణచేస్తారు కొందరు. నిజా నికి ఇలాంటి దాన్ని మనం ‘పరువు’ అనే పేరుతో పి లుస్తున్నాం. ఇది సరైన పదం కావు. సామాజిక రోగాలు లేని సమాజంలో, శ్రమని గౌరవించే సమాజాల్లో, మనుషులమధ్య అంతరాల దొంతరలు లేని సమాజంలో ‘పరువుల’ అనేది వుండదు. పోదు. పరువు అనేది ‘మనువు’ అనే పాచికుప్ప మీద లేచిన పిచ్చి పుట్టగొడుగు. కాబట్టి, ‘మనువు’ లేకుండా ఇక్కడ ‘పరువు’ అనేది ప్రత్యేకంగా లేదు. నిజా నికి మనుధర్మ శాస్త్రం ‘ఆత్మవాద’ వైదిక సిద్ధాంతాన్ని  బతికించే శాసనం. ఉపనిషత్తుల తీర్మానం. వేదాల్లో కులవ్యవస్థ కఠినంగా కనిపించదు. అది వర్ణవ్యవస్థ పేరుతో మొలచీ మొలవకుండా వున్న కులవ్యవస్థలో కనిపిస్తుంది. కులవ్యవస్థకి కుదుళ్ళు చేసింది ఉపనిష త్తులే. ఆత్మలు పుట్టేప్పుడు - రమణీయమైన ఆత్మలు ‘బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య యోనుల్లో’, నీచ ఆత్మలు కుక్కలు, పందులు, శూద్రుల యోనుల్లో పుడతాయని ఛాందోగ్యోపనిషత్తులో వుంది. అంటే... బ్రాహ్మణ ఆ త్మలు ఎప్పుడూ బ్రాహ్మణులుగానే, శూద్రుల ఆత్మలు ఎప్పుడూ శూద్రులుగానే పుడతాయని దీనర్థం. అంటే వేదాలు చెప్పిన వర్ణవ్యవస్థని ఉపనిషత్తులు తమ ‘ఆ త్మవాదంతో’ కులాలకు కుదుళ్ళను చేశాయన్న మాట.మనిషికి గుణాన్ని బట్టిగాక, కులాన్ని బట్టే అర్హత లు వచ్చేస్తాయని ఉపనిషత్తులు తీర్మానించాయి. అలా కులవాదం పుట్టి, కులాల దొంతరలు ఏర్పడి, చివరికి కరుడు కట్టుకుపోయాయి. ఇది వేల సంవత్సరాల వైదిక ఉపనిషత్తుల భావమాయాజాలం. ఆ మాయా జా లాన్ని రక్షించేదే మనుధర్మం.
 
ఆ ఒక్కటీ తప్ప...
ఒక్క బౌద్ధ ధర్మశాస్త్రం తప్ప, ఈ దేశంలో వచ్చి న ధర్మశాస్త్రాలన్నీ దాదాపుగా మనువుకి బానిసలే. వారసులే. బంటులే. బౌద్ధం మాత్రమే దీన్ని వ్యతిరే కించింది. బుద్ధుడు ‘మానవుడు’ అనే పదానికి ‘మనస్సు వున్నవాడు మానవుడు’ అని నిర్వచనం ఇచ్చాడు. ఇది వైదిక భావజాలానికి పూర్తి విరుద్ధం. బౌద్ధం ప్రకారం ‘మనువు’(పెళ్ళి) అంటే ‘మనస్సులు కలసినదే మనువు’ అని. పెళ్ళికి మనస్సులే ముఖ్యం. మన స్సుకి కులం వుండదు. మనస్సుకు మానవీయతే వుంటుంది. మానవీయత వున్న చోట కులం, మతం అనే భేదాలకు తావుండదు. ఈర్ష్య, ద్వేషం, అసూయలకు నెలవు ఉండదు. కాబట్టి, మానవీయ భావజాలంలో పగకు మూలమైన ‘పరువు’ అనేది కూడా వుండదు. నిజానికి ఇలాంటి విషయాల్లో వీటిని ‘పరువు హత్యలు’ అని చెప్పడంలోనే ఆ పనిచేసిన దుర్మార్గుల్ని రక్షించే కోణం దాగుంది. ‘పాపం, అతను తన పరువు (ప్రతిష్ట)పోయిందనుకుని ఆ బాధలో ఈ పని చేశాడు’ అనే ఒక సానుభూతి కనిపిస్తుంది. ఆ పిల్లలు అతని ‘పరువు తీశారు’ అంటే... తప్పు చేశారు అనే ధ్వని కూడా వినిపించీ వినిపించకుండా వినిపిస్తూనే వుంటుంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు చేసే హత్య ల్ని ‘పరువు హత్యలుగా’ చెప్పడం కూడా మనువాదం లో భాగమే. ఇవి, పరువు హత్యలు కాదు. ‘మనుహత్యలే’. లేదా ‘కుల హత్యలే’. నిజానికి ఆర్థిక వ్యత్యాసాల కంటే సమాజంలో అశాంతిని, అమానవీయతనూ, మను షుల మధ్య మహాద్వేషాన్ని ఈ దేశంలో ‘కులం’ మాత్రమే రేపగలదు.

అందుకే...మన సమాజంలో- 
‘కూటికి పేదనేగానీ, కులానికి కాదు’ అనే నాను డి బలంగా నాటుకుపోయింది. ధనం కంటే ‘కులం’ ఎంత బలమైందో ఈ నానుడి చెప్పకనే చెప్తుంది. కు లానికి తోడు ధనమదం తోడైతే.. కులవిద్వేషం మారుతీరావులా విషనాగై కాటేస్తుంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశభక్తి తట్టిలేపడం వల్ల ‘కులభక్తి’ కాస్త తగ్గింది. మార్కిస్టు ఉద్యమాల మహా ఉధృతి వల్ల కులసర్పాలు కుబుసంలోనే కొంత దాక్కున్నాయి. అనేక సంస్కరణవాద ఉద్యమాల వల్ల ఆనాడు కులాంతర వివాహాలు ఇంత దారుణంగా ముగిసేవి కావు. చాలాచోట్ల కుటుంబ పెద్దలే ముం దుకొచ్చి కులాంతర వివాహాల్ని స్వాగతించారు. హిం దూ మతోన్మాద హింసావాదం కొద్దిగా పడగ ముడిచి న కాలం అది. 

తగ్గిన ఎగుమతులు, పెరిగిన దిగుమతి
కానీ, మరలా ఇప్పుడు... ఆ కులోన్మాద కాల నా గు ముగిసిన పడగ మరలా విప్పింది. ఉత్తర భారత దేశం నుంచి ఈ ఉన్మాదపు విషం మెల్లగా దక్షిణాదికి కూడా పాకుతోంది. స్వతహాగా మూలవాసులైన దక్షి ణాది ప్రజలు ఇలాంటి వివాహాల విషయంలో ఒక ప్పుడు అయిష్టంగానే అంగీకరించేవారు. గగ్గోలు పెట్టే వారు. పిల్లల్ని తమ ఇంటికి ఇక రావద్దని, తమ ఆస్తి కోరుకోవద్దని బహిష్కరించేవారు. ఇవి చేయలేకపోతే ‘తమకు తాము ఆత్మహత్యలు’ చేసుకునేవారు. కొంద రైతే... ఇది తమ పెంపకం లోపంగా తమకు తాము సర్దిచెప్పుకునేవారు. ఇంకా ఇంకా ప్రయత్నించి ‘వారి ద్దరి’ మధ్యా కొండేలు సృష్టించి విడగొట్టేవారు. వారికి సంతానం కలిగాక మనవళ్ళనో, మనుమరాళ్ళనో చూసుకొని వారి పేరుతో కలసిపోయేవారు. ఈ మొత్తం చర్యల్లో అవగాహనా రాహిత్యం, పరువు, ప్రతిష్టలు, కుల కట్టుబాట్లు... కన్పిస్తాయి. కానీ ఎక్కడా ఉన్మాదం కనిపించదు. కన్పించేది కాదు. ఇప్పుడు ఈ ఉన్మాదం ఉత్తరాది నుంచి దిగుమతి అవుతోంది. క్రూరమైన మనుధర్మం మనలోని మానవీయత ని నాశనం చేసి మనుషుల్ని కులాల పేరుతో ఇలాం టి నేరాలకు వుసిగొల్పుతుంది. ఇవి ఆవేశంతో అప్ప టికప్పుడు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు కాదు. అందుకే ఈ దుర్మార్గుల మాటల్లో కనీసం పశ్చాత్తాపా న్ని కూడా చూడలేం. వీరి హృదయంలో కుల క్రూర త్వం తప్ప మరొకటి వుండదు. వీళ్ళు కడుపు తీపి తెలియని వాళ్ళూ కాదు. మనస్సు నిండా మనువాదా న్ని, తనువు నిండా కుల దురంహంకారాన్ని నింపు కొని మనువు మంత్రించి వదిలిన మహా మృగాలు వీళ్ళు.

విచిత్రం ఏమంటే....
ఒకప్పుడు దక్షిణాదిలో బలంగా బయలుదేరిన సంస్కరణవాద గాలులు నైరుతి రుతుపవనాల్లా ఉత్త రానికి వీచేవి. మానవత్వాన్ని మొలకెత్తించేవి. కానీ... ఇప్పుడు మానవత్వాన్ని మట్టిలో కలిపి గడ్డకట్టించే ఉన్మాదపు శీతలగాలులు బయలుదేరి దక్షిణాదిని తాకు తున్నాయి. ఇది చాలా తీవ్రంగా ఆలోచించా ల్సిన విషయం.
ఈ వ్యాసాన్ని అంబేడ్కర్‌తోనే ముగిద్దాం. 

మరలా మొదట చెప్పుకున్న మాటే....
‘అందుకే...అంబేడ్కర్ మనుధర్మ శాస్త్రాన్ని తగు లబెట్టాడు’ మనం ఆ మాటలు చెప్పుకుంటూ, చప్ప ట్లు కొట్టుకుంటూ బతికితే ‘మనువు’ చావడు! మారు తీరావునో, మనోహరాచారినో తప్పక శిక్షించాలి. అయి తే ... వారిని శిక్షిస్తే మనువు మాయమైపోడు. ‘మాయమై పోతున్నడమ్మ... మనిషన్నవాడు’’ అని అందేశ్రీ అన్నట్లు ఆ మనువు ‘మనిషినే మాయం చేస్తాడు. మానవవాదాన్ని, మానవీయతనూ బతికిస్తే ....మనువే మాయమౌతాడు. మనువు పోతేనే మనిషి మనిషిగా బతుకుతాడు.
బొర్రా గోవర్ధన్, 
9390600157.

English Title
These are not 'murders' killings and 'manu' murders !!
Related News