మధుమేహానికి మంచి మందులు..!

Updated By ManamSat, 03/10/2018 - 14:23
representational

representationalమధుమేహం.. ఈ మహమ్మారి పట్టిందటే ఎప్పుడూ నోరు కట్టుకు కూర్చోవాల్సిందే. అన్నం తినలేం. స్వీట్లు ముట్టలేం. ఏ తిండీ సరిగ్గా తినలేం. ఏదైనా మోతాదు దాటిందా.. అంతే మనలోని చక్కెర మోతాదు దాటిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మంది మధుమేహులున్నారిప్పుడు. అయితే, అది వచ్చాక ఆహార నియంత్రణే కాదు.. అసలు ఆహారపుటలవాట్లు, జీవనవిధానాల వల్లే అది వస్తుంది. అది వచ్చాక కంట్రోల్‌లో పెట్టడానికి ఆహార నియంత్రణ ఒక్కటే సరైన చికిత్స కాదని అంటున్నారు ఫోర్టిస్ ఆస్పత్రి డయాబెటిస్ అండ్ మెటబోలిక్ డిసీజెస్ డైరెక్టర్ అనూప్ మిశ్రా. అసలు తీసుకోవాల్సిన ఆహారమేంటో ముందు తెలుసుకోవాలని చెబుతున్నారు. ఏది మంచిది.. ఏది కాదు అన్న వర్గీకరణ చేసుకోవాలంటున్నారు. అయితే, కొందరు పళ్లు తింటే కూడా చక్కెర స్థాయులు పెరుగుతాయని ఆందోళన చెందుతుంటారని, అలాంటి వారు ఏ పళ్లను తీసుకుంటే మంచిదో వివరించారాయన. దాదాపు 15 రకాల పళ్లు మధుమేహులకు మేలు చేస్తాయని చెప్పారు. 

 

1. నారింజ..
అందరికీ కామన్‌గా దొరికే ఫలం నారింజ. దానిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అత్యంత తక్కువగా ఉంటుంది కాబట్టి.. అది తిన్నా శరీరంలో చక్కెర స్థాయులు అమాంతం పెరిగిపోవు. అంతేకాదు.. అందులోని విటమిన్ సీ మధుమేహాన్ని కొంతలో కొంతైన నియంత్రిస్తుంది. 

2. పుచ్చకాయ...
ఎర్రగా నీటితో ఉండే పుచ్చకాయ శరీరాన్ని వేసవిలో చల్లబరుస్తుంది. 95 శాతం నీరే ఉండే పుచ్చకాయ.. శరీరం నీరసించకుండా ఉంచుతుంది. నీటి స్థాయులను పెంచుతుంది. మధుమేహులు దీనిని తీసుకుంటే.. ఆకలి దప్పులను తగ్గిస్తుంది. తద్వారా గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలోనే ఉంటాయి. 

3. సేపులు...
రోజుకో యాపిల్ పండు వైద్యుడి అవసరం రానివ్వదు అంటారు. అవును నిజమే.. అన్ని సందర్భాల్లోనూ ఆ మాట నిజమని నిరూపితమైంది. యాపిల్‌లో ఉండే పోషకాలు శరీరానికి అన్నివిధాలా ఉపయుక్తమవుతాయి. అయితే, యాపిల్ మాత్రం తియ్యగా ఉంటే పండులో సగం తింటే చాలు. మొత్తం తింటే మళ్లీ మొదటికే మోసం వచ్చే ప్రమాదముంటుంది. 

4. దానిమ్మ...
ఎర్రెర్రటి గింజలతో చూడగానే ఆకర్షించే పండు దానిమ్మ పండు. రూపం పరంగానే కాదు.. పోషకాల పరంగానూ దానిమ్మ ఇట్టే ఆకర్షిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వంటి పోషకాలు దానిమ్మలో మెండుగా ఉంటాయి. కాబట్టి మధుమేహం లాంటి మహమ్మారిలతో పోరాడడానికి అవి ఎంతో ఉపకరిస్తాయి. శరీరంలోని చక్కెర స్థాయులను అవి తగ్గిస్తాయి. 

5. జామపండు...
ఇది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే పండు. విటమిన్ సీ, ఫైబర్ అధికంగా ఉండే ఈ పండుకు చక్కెర స్థాయులు తగ్గించే గుణమూ ఎక్కువే. 

6. స్ట్రాబెర్రీ...
స్ట్రాబెర్రీలో ఉండే ఎలాజిక్ యాసిడ్‌కు చక్కెర స్థాయులను తగ్గించే శక్తి ఉంటుంది. అంతేకాదు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి ఇందులో.

7. పొప్పడి పండు...
డెంగ్యూ వచ్చి రక్తకణాలు తగ్గిపోతే.. డాక్టర్లు బొప్పాయి పండును సూచిస్తారు. ఎందుకంటే ప్లేట్‌లెట్స్‌ను బొప్పాయి వృద్ధి చేస్తుంది. దానికి కారణం లేకపోలేదు. దానిలో మెండుగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాల వినాశానాన్ని అడ్డుకుంటుంది. తద్వారా కణాలు త్వరితగతిన వృద్ధి చెందుతుంటాయి. అందుకే మధుమేహులకు బొప్పాయి పండు చాలా మంచిదే అంటున్నారు వైద్యులు. 

8. నిమ్మకాయ...
పుల్లటి నిమ్మకాయలో విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు, కరిగిపోయే ఫైబర్ విరివిగా ఉంటుంది. ఆ ఫైబర్ శరీరంలో ఉండే చక్కెర స్థాయులను నియంత్రిస్తుంటుంది. కాబట్టి నిమ్మకాయను ప్రత్యక్షంగానో పరోక్షంగానో తీసుకుంటే మధుమేహులకు మంచిదే. 

9. పీచ్ ఫ్రూట్...
చూడడానికి యాపిల్ లాగానే అనిపించే ఈ పండులో కూడా విటమిన్ సీ ఎక్కువగానే ఉంటుంది. అంతేకాదు.. కళ్లకు మంచి చేసే విటమిన్ ఏ, కెరోటినాయిడ్స్ పుష్కలం. మధుమేహాన్ని తగ్గించే శక్తి కెరోటినాయిడ్స్ సొంతం. 

10. రాస్ప్‌బెర్రీస్...
రాస్ప్‌బెర్రీల్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయుల నియంత్రణకు ఆ రెండు పోషకాలు కూడా ఎంతో ముఖ్యం. 

11. బ్లూ బెర్రీ...
చిన్నగా చూడ్డానికి రేగిపళ్లలా అనిపించే ఈ బ్లూబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లలో కీలకమైన యాంతో సయనిన్స్ విరివిగా లభిస్తాయి. ఆ పండుకు నీలిరంగును అందించే ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. యాంటీ కేన్సర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పేరున్న బ్లూ బెర్రీ.. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. 

12. కివీ ఫ్రూట్...
బయటి నుంచి చూస్తే కొంతలో కొంత సపోటలా అనిపించే ఈ కివీ ఫ్రూట్.. విటమిన్ సీ, ఫైబర్‌కు మెండు. ఆ పండులోని ఆ గుణాలే మధుమేహాన్ని నియంత్రించే సాధకాలు. కాబట్టి మధుమేహులు కివీ ఫ్రూట్‌ను తిన్నా మంచి ఫలితాలే వస్తాయి. 

English Title
These Fruits Are Good ForThe Diabetics
Related News