అష్టబంధన సమర్పణ

Updated By ManamWed, 08/15/2018 - 02:57
ttd
  • మూలమూర్తి.. ఇతర విగ్రహాలకూ.. ఆగమోక్తంగా జరిగిన కార్యక్రమం

  • 8 దిక్కుల్లో అష్టబంధనం సమర్పణ.. 12 ఏళ్లకు ఓసారి జరిగే మహాఘట్టం

  • తిరుమల పరిసరాలలో సరికొత్త శోభ.. ధ్వజస్తంభానికి బంగారు రావి ఆకులు

  • మరిన్ని సరికొత్త అలంకరణలు కూడా..నేడు పూర్ణాహుతి.. తిరుమంజనం

imageతిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణంలో భాగంగా మంగళవారం ఆగమోక్తంగా అష్టబం ధన సమర్పణ జరిగింది. ఉదయం 5.30 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరిగి రాత్రి 7 నుంచి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. గర్భాలయంలోని శ్రీ వేంకటేశ్వర 
 స్వామివారి మూలమూర్తితోపాటు ఉప ఆలయాలైన శ్రీ గరుడాళ్వార్, పోటు తాయార్లు, శ్రీవరద రాజస్వామి, శ్రీ యోగ నరసింహస్వామి, శ్రీ విష్వక్సేన, శ్రీ భాష్యకార్లు, శ్రీవేణుగోపాల స్వామి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి విగ్రహాలకు అష్టబంధన సమర్పణ జరిగింది. ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామి వారి పాదాల కింద, చుట్టుపక్కల తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పించారు. దీంతో అష్టబంధన సమర్పణ నిర్విఘ్నంగా పూర్తయినట్లయింది.

12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్కృష్ట ఘట్టానికి ప్రధానార్చకుడు వేణుగోపాల దీక్షితులు కంకణభట్టార్‌గా వ్యవహరించారు. ఇంతకుముందు 2006 సంవత్సరంలో జరిగిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం మళ్లీ ఇపుడు జరుగుతుండటంతో ఆలయం అంతా సరికొత్త శోభను సంతరించుకుంటోంది. మహాసంప్రో క్షణ సందర్భంగా ధ్వజస్తంభం మొదలుకొని ఆలయ పరిసరా లు మొత్తాన్ని పూర్తిగా పరిశుభ్రం చేస్తున్నారు. భక్తుల రాక అంతంతమాత్రంగానే ఉన్నా.. వచ్చిన కొద్దిమంది ఆలయానికి కొత్త కళ వచ్చిందని కనులారా వీక్షించి ఆనందిస్తున్నారు.

English Title
thirumala news
Related News