కుల్గాం కాల్పుల్లో ముగ్గురు మృతి

Updated By ManamSat, 07/07/2018 - 13:51
Burhan Wani

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నిరసనకారులు, భద్రతా దళాల మద్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మృతి చెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం జరిగిన ఘర్షణల్లో ఓ టీనేజ్ యువతితో పాటు మరో ఇద్దరు స్థానికులు మరణించారు.

Kashmir encounter

కాగా హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ చనిపోయి రెండో ఏడాది సందర్భంగా వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ముందు  జాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులు భద్రతా దళాలపై రాళ్ల దాడి చేశారు.

వారిని అదుపు చేసేందుకు భద్రతా దళాలు కాల్పులు జరిపారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దక్షిణ కశ్మీర్ జిల్లాల్లో ముందస్తుగా మొబైల్, ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేశారు. 
 

English Title
Three civilians killed during clashes with security forces in Kashmir
Related News