అగ్ర‌రాజ్యంలో మ‌ళ్లీ కాల్పుల క‌ల‌క‌లం

Updated By ManamMon, 08/27/2018 - 08:05
three dead as video gamer goes on shooting spree
three dead as video gamer goes on shooting spree
  • ఫ్లోరిడాలో కాల్పులు, ముగ్గురు మృతి

ఫ్లోరిడా : అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌ళ్లీ కాల్పులు మోత క‌ల‌క‌లం రేపింది. ఆన్‌లైన్ ఫుట్‌బాల్ వీడియో గేమ్ పోటీలలో పాల్గొన్న‌వారిపై ఇద్ద‌రు దుండ‌గులు  విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెంద‌గా, మ‌రో 11మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఈ సంఘ‌ట‌న ఫ్లోరిడా లోని జాక్సన్‌విలేలోని లాండింగ్ ప్రాంతంలో ఆదివారం జ‌రిగింది. కాగా  పోటీలను ప్రత్యక్షప్రసారం చేస్తున్న కెమెరాలో కాల్పులు ఘటన రికార్డయింది. మృతుల్లో ఓ దుండ‌గుడు కూడా ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

English Title
Three Killed, 11 injured In Mass Shooting At Florida Mall
Related News