హైదరాబాద్‌లో భారీ వర్షం: ముగ్గురి మృతి

Updated By ManamThu, 05/03/2018 - 18:32
Three killed, Heavy rain at Hyderabad Heavy rain, Hyderabad, GHMC, Capital City

Three killed, Heavy rain at Hyderabad Heavy rain, Hyderabad, GHMC, Capital Cityహైదరాబాద్‌: నగరంలో పలు చోట్ల భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షాల కారణంగా గురువారం నగరంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పట్టపగలే కారు చీకట్లు కమ్ముకున్నాయి. అన్ని  ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అశోక్‌నగర్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, నాంపల్లి, అబిడ్స్‌, కోఠి, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, బహుదూర్‌పురా, యాకుత్‌పురా, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, సైదాబాద్‌, ముషీరాబాద్‌, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, ఈసీఐఎల్‌, ఓయూ, తార్నాక తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పెద్ద శబ్దాలు రావడంతో భయాందోళనలకు గురయ్యారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. రాజధాని నగరంలో ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈదురు గాలుల బీభత్సానికి నెక్లెస్‌ రోడ్డుపై చెట్టు విరిగిపడింది. కారు, ఆటో, రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గరు మృతిచెందారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోనూ చెట్లు కూలాయి. మరోచోట బస్‌ షల్టర్‌ ఒరిగిపోయింది. విరిగిపడిన చెట్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసులు తొలగిస్తున్నారు.

English Title
Three killed, Heavy rain at Hyderabad Heavy rain
Related News