ఆ మూడు టెస్టులు ఫిక్స్!

Updated By ManamSun, 05/27/2018 - 23:40
pak
  • సంచలనం సృష్టిస్తోన్న ఆల్‌జ జీరా స్టింగ్ ఆపరేషన్

  • తెరైపెకి  పాక్ క్రికెటర్ హసన్ రాజా, మరికొందరు

  • రాబిన్ మోరిస్, యూఏఈ అడ్వర్టయిజింగ్ 

  • ఏజెన్సీ, డి కంపెనీ ముఠా సూత్రధారులు

matchదుబాయ్: రెండేళ్లలో కనీసం భారత్ ఆడిన మూడు టెస్టు మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయని అల్‌జజీరా న్యూస్ ఛానల్ సంచలన ఆరోపణలు చేసింది. క్రికెట్‌లో అవినీతిపై తమ పరిశోధనా విభాగంతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు దోహాకు చెందిన ఈ ఛానల్ పేర్కొంది. క్రికెట్‌లో అవినీతిపై ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. గాలెలో 2017, జులై 26 నుంచి 29 వరకు జరిగిన భారత్-శ్రీలంక టెస్టు మ్యాచ్, రాంచీలో 2017, మార్చి 16-20 మధ్య జరిగిన భారత్-ఆస్ట్రేలియా టెస్టు, చెన్నైలో 2016, డిసెంబర్ 16-20 మధ్య జరిగిన భారత్-ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ ఫిక్సింగ్‌కు గురయ్యాయని ఆ ఛానల్ పేర్కొంది. బుకీల ప్రభావం ఈ మ్యాచ్‌లపై ఉందని ఆరోపిం చింది. ఈ మూడు టెస్టుల్లో రెండింటిలో భారత్ గెలుపొందగా.. రాంచీ టెస్టు డ్రాగా ముగిసింది. రాంచీ టెస్టు ఫిక్సింగ్‌లో కనీసం ఇద్దరు ఆసీస్ క్రికెటర్ల ప్రమేయం ఉందని ఆ ఛానల్ తెలిపింది. చెన్నైలో జరిగిన టెస్టులో ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రమేయం ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని చెప్పింది.  ముంబైకి చెందిన మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్, యూఏఈలో ఉండే ఇండియన్ అడ్వర్‌టైజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, డీ కంపెనీ సభ్యులు ఈ మ్యాచ్ ఫిక్సింగ్‌కు సూత్రధారులు.  జట్టు ఆటగాళ్లతో పాటు ఐసీసీలోనూ తమకు తెలిసిన వ్యక్తుల సాయంతో వీళ్లు మ్యాచ్‌లను ఫిక్స్ చేసినట్లు ఈ స్టింగ్ ఆపరేషన్‌లో తేలింది.

జర్నలిస్ట్ డేవిడ్ హారిసన్ ఈ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక సెషన్ లేదా మ్యాచ్ మొత్తం ఫలితాన్ని తారుమారు చేసేందుకు క్యూరేటర్లతోపాటు ప్రస్తుత, మాజీ క్రికెటర్లకు ఫిక్సర్లు ఎలా డబ్బు చెల్లిస్తారో ఈ ఆపరేషన్ ద్వారా చూపెట్టారు. పాక్‌కు చెందిన హసన్ రాజాతోపాటు శ్రీలంక క్రికెటర్లు దిల్హర లోకుహెట్టిగె, జీవంత కులతుంగ, తారిండు మెండిస్ ఈ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు స్టింగ్ ఆపరేషన్ తేల్చింది.  గాలె పిచ్ క్యూరేటర్ తరంగ ఇండికా తాను ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడు. 2016 ఆగస్టులో గాలెలో ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసింది. అప్పుడూ ఈ క్యూరేటర్ ఫిక్సింగ్ చేశాడు. ఆ తర్వాత గతేడాది జులైలో ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 600కుపైగా స్కోరు చేసింది.మ్యాచ్ ఫిక్సర్లు చెప్పినట్లే ఈ రెండు మ్యాచ్‌లూ సాగినట్లు తాజా స్టింగ్ ఆపరేషన్ వెల్లడించింది.  క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్ పేరుతో అల్‌జజీరా ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. అయితే ఈ ఫిక్సింగ్‌లో ఏ ఇండియన్ ప్లేయర్ లేడు. ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్స్ మాత్రం ఫిక్సింగ్‌కు పాల్పడినా.. వాళ్ల పేర్లు బయటకు రాలేదు. చెన్నై టెస్టులో ముగ్గురు ఇంగ్లండ్ ప్లేయర్స్ కూడా ఫిక్సింగ్ చేసినట్లు తేల్చింది. ఇంగ్లండ్ ప్లేయర్స్ ఈ ఆరోపణలను ఖండించగా.. ఆస్ట్రేలియా ప్లేయర్స్  అసలు స్పందించలేదు.

English Title
That Three Tests Fix
Related News