ఉరుముతున్న ఉగ్రవాదం

Updated By ManamWed, 02/14/2018 - 22:49
terrarism

terrarismజమ్మూలోని సుంజువాన్ సైనిక స్థావరంపై దాడిముగియక ముందే, శ్రీనగ ర్‌లోని కరణ్‌నగర్ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు మరోదాడి చేయడం మన రక్షణ వ్యవస్థలోని బలహీనతలకు అద్దం పడుతున్నాయి. జమ్మూ, శ్రీనగర్‌లో చోటుచే సుకున్న ఉదంతాలు సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలోని పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో పీడీపీ-బీజేపీ సంకీర్ణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరిహద్దుల్లో దాడులు, లోయలో హింసాత్మక ఘటనలు పెరి గాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సుంజువాన్‌లో సైనిక స్థావరంపై దాడిలో ఐదుగురు సైనికులు, ఒక పౌరుడు మరణించగా నలుగురు ఉగ్రవాదులు హత మైన ఘటన సాధారణ ఉగ్రవాద వ్యతిరేక సైనిక చర్యలుగా భావించలేము. జ మ్మూ-కశ్మీర్‌లోని సైనిక స్థావరాలను తగినంత పటిష్టంగా తీర్చిదిద్దుకోవలసిన అవసరాన్ని తెలియజేసినప్పటికీ, దాడులు ఆకస్మికంగా పెరగడానికి కారణాలను నివారించడం ముఖ్య కర్తవ్యంగా నిలుస్తుంది.


ఏడుగురు సైనికులు మరణించిన 2016 జనవరిలో పఠాన్‌కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదదాడి ఉదంతంనేపథ్యంలో సైనిక వైస్‌చీఫ్ మాజీ జనరల్ ఫి లిప్ కాంపోస్ సారథ్యంలో త్రివిధ బలగాల ఉన్నత స్థాయి కమిటీ అనేక రక్షణ చర్యలు ప్రతిపాదించింది. అలాగే 2016 సెప్టెంబర్‌లో వురి సైనిక స్థావరంపై జరిగిన దాడిలో 19 మంది జవాన్లు మరణించారు. అందుకు ప్రతీకారంగా మోదీ ప్రభుత్వం సర్జికల్ దాడులు జరిపి పాక్ భూభాగంలోని కొన్ని సాయుధ శిబిరా లను ధ్వంసంచేసింది. ఈ సర్జికల్ దాడులు పాకిస్థాన్‌కు గుణపాఠమవుతుందన్న భారత్ తలంపును పూర్వపక్షం చేసింది. సరిహద్దు ఆవల నుంచి సైనిక స్థావరా లపై జరుగుతున్న దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రక్షణ వ్యవస్థలను పటిష్టపరచుకోవడంతోనే సరిపోదు. అక్రమ చొరబాట్లను అడ్డుకోవడం, సరిహ ద్దుకావల ఉగ్రవాద శిబిరాల నిర్మూలనకు కృషిచేయడం, అంతర్జాతీయ దౌత్యం తో పాక్ ప్రభుత్వంపై ఒత్తిడిపెంచడం వంటి చర్యలను సమన్వయంతో నిర్వహిం చాలి. దౌత్యపరంగా అంతర్జాతీయ ఒత్తిడి పెంచడంలో భారత్ విజయం సాధించి నప్పటికీ, భౌగోళిక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఉగ్రవాదుల దాడులు పెరగడాన్ని, ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరడాన్ని ఈ పరిణామాలు వెల్లడిస్తున్నా యి. సర్జికల్ దాడుల తర్వాత పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనలు మూడురెట్లు పెరగగా, అక్రమంగా ప్రవేశిస్తున్న ఉగ్రవాదుల సంఖ్య రెట్టింపు అయింది.


సరిహద్దులను కాపలా కాసేందుకు ఎక్కువమందిని కేటాయించడం, సైనిక స్థావరాలు నాసిరకం భద్రతా ఏర్పాట్లతో ఆధీన రేఖ/అంతర్జాతీయ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండటం, వాటికి అతిసమీపంలో పౌర నివాస ప్రాంతాలుం డటంతో ఉగ్రవాదులు సులభంగా దాడిచేసేందుకు దోహదం చేశాయి. సుంజు వాన్, శ్రీనగర్ దాడుల తర్వాత రక్షణ మంత్రిత్వశాఖ లక్షలాది రైఫిళ్ళను, వేలాది మెషీన్‌గన్‌లను కొనడానికి 16 వేల కోట్ల రూపాయలను సైన్యానికి కేటాయిం చింది. ఆయుధాల కొనుగోళ్లతో పాటు రక్షణ వ్యవస్థలను పటిష్టం చేసుకునేం దుకు ఫిలిప్ కమిటీ సిఫారసులు తక్షణం అమలు చేయవలసిన అవసరం ఉంది. ఈ దాడుల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి పాకిస్థాన్‌తో చర్చలు జర పాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం మరింత విడ్డూరం. చైనా దూకుడుకు చెక్ పెట్టాలన్న అమెరికా భౌగోళిక రాజకీయ వ్యూహంతో ఆఫ్ఘానిస్థాన్‌లో భారత జో క్యం పెరగడం, ఇజ్రాయెల్‌తో మైత్రీబంధం ఇదివరకెన్నడూ లేనంతగా బలపడ డం, అంతర్గతంగా ‘ఏకీకృత హిందూ అసిత్త్వం’ను సంఘటితం చేసి అధికారాన్ని సుస్థిరం చేసుకునే క్రమంలో ముస్లింలపై భౌతిక, సాంస్కృతిక దాడులు పెరగడం వంటి చర్యలు దేశంలో పాక్ ప్రేరిత/దేశీ ఉగ్రవాద ప్రమాదం పెరగడానికి దోహదం చేశాయి. ప్రతీకారంగా సర్జికల్ దాడులు చేయడం, ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్లలో చంపడం, సైనిక స్థావరాలు పటిష్టంగా రూపొందించడం వంటి సాంకేతిక చర్యలు ఉగ్రవాదానికి తాత్కాలిక ఉపశమనాలే! 

Tags
English Title
Throwing terrorism
Related News