తెలుగులో ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’.. ప్రోమో విడుదల

Updated By ManamWed, 09/26/2018 - 12:42
Thugs Of Hindostan

Thugs Of Hindostanబాలీవుడ్ టాప్ హీరోలు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించగా.. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్యచోప్రా నిర్మించారు. కత్రినా కైఫ్, దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ హీరోయిన్లుగా నటించారు. కాగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. హిందీతో పాటు దక్షిణాది భాషలైన తెలుగు, తమిళంలో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ తెలుగులో తమను పరిచయం చేసుకొని సినిమా చూడంటి అంటూ పిలుపునిచ్చారు. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లు అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్ర ట్రైలర్ గురువారం ఈ మూవీ ట్రైలర్ రానున్న విషయం తెలిసిందే. 

 

English Title
Thugs Of Hindostan will release in Telugu
Related News