రాయలసీమవాసులకు ‘పిడుగు’ హెచ్చరిక

Updated By ManamWed, 09/26/2018 - 09:49
Thunder Strike

Thunder Strikeఅమరావతి: రానున్న 24 గంటల్లో రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూల్లో జిల్లాలకు ఈ ప్రభావం ఉందని తెలిపింది. అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ, వజ్రకరూర్, గుంతకల్.. కడప జిల్లాలోని లింగాల.. కర్నూల్ జిల్లాలోని హాల్వహర్వి, చిప్పగిరి మండలాలలో రాబోయే 24గంటల్లో పిడుగులు పడతాయని ఆ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమైన సందర్భాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

English Title
Thunder strike warning to Rayalaseema districts
Related News