తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Updated By ManamSun, 11/26/2017 - 10:40
Tirumala devotees, Tirumal Tirupati, Lord Venkateswara, Heavy rush

Tirumala devotees, Tirumal Tirupati, Lord Venkateswara, Heavy rush తిరుమల: తిరుమల తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. అందులోనూ కార్తీక మాసం కావడంతో కలియుగ శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీసంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఆదివారం శ్రీవారి దర్శనానికి మొత్తం 41 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా నడక దారి భక్తులకు 2గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 77, 470 మంది భక్తులు దర్శించుకున్నారు.

English Title
Tirumala devotees rush in Tirumala
Related News