రానుంది టీజేఎస్ కాలమే..

Updated By ManamSat, 09/22/2018 - 00:10
kodandaram
  • అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం

  • వచ్చే ఎన్నికల్లో 50 పైగా స్థానాలు గెలుస్తాం

  • పొత్తుల్లో అమరుల ఆశయాలు, ఉద్యమ ఆకాంక్షలకే పెద్దపీట

  • టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం 

kodandaramహైదరాబాద్:  ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నవారు, పోరాటాలలో మవేుకమైనవారిలో ఎక్కువ మంది ప్రజాసంఘాలలో కానీ, ఉద్యమకారులుగానే కానీ ఉండిపోతారు తప్ప రాజకీయనాయకులుగా పూర్తిగా పరావర్తనం కాలేరన్నది తెలిసిన విషయమే. సరిగ్గా అదే కోవకి చేందిన వారుగా తెలంగాణ ప్రజలంతా..టీ.జాక్ మాజీ ఉద్యమ నేత, ప్రస్తుత టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్  కోదండరాం పేరును యాది చేస్తరు. ఇక, తెలంగాణలో కోదండరాం పేరు చెప్తే...ఆ సారా అంటారు. అయితే, ఎన్నికల వరకూ వచ్చేసరికి...ఎలక్షన్‌లు, ఓట్ల పండుగ అనే పంచాయతిలో ఆయన.. కేసీఆర్‌కు సరితూగడన్నది ఉద్యమ నేతలతో పాటు..టీఆర్‌ఎస్ నేతల్లో సైతం ఇదే భావన పేరుకుపొయిందని చెప్పక తప్పదు. ఇక, తెలంగాణ ఉద్యమం సందర్భంగా..ఓ దశలో కేసీఆర్, కోదండరాం సమ ఉజ్జీవులుగా పేర్కొన్న వారున్నారు. దీన్ని ఎవరూ కాదనలేరు. కానీ రాజకీయ పార్టీలుగా టీఆర్‌ఎస్-టీజేఎస్ సమ ఉజ్జీవులా. ? కనీసం కోదండరాం పార్టీ పోటీ ఇవ్వగలుగుతుందా.? లేదా? అన్నది  పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని ముందుకు సాగలని మలిదశ ఉద్యమ నేతలు చెప్తున్నారు. అయితే, ఉద్యమకారుడికి ఉండే దూరదృష్టితో కోదండరాం పార్టీని నెట్టుకొస్తున్నారు. పార్టీలో ఇప్పటికే దూరదృష్టి ఉన్న నేతలు లేకపోవటం, ప్రజల పక్షాన పోరాడిన పెద్ద నాయకులు టీజెఎస్‌లో లేరన్నది సుస్పష్టంగా తెలుస్తొంది. అందుకే, కోదండరాం అలాంటి నేతను పార్టీలోకి తీసుకు రావాలని చాల కాలంగా ఎదురు చూస్తున్నారు. 

మాస్ లీడర్ రచనా రెడ్డి
తెలంగాణ మాస్ లీడర్‌గా పేరున్న మాస్ లీడర్. రచనా రెడ్డి న్యాయవాది కూడా.  తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెపట్టిన భారీ ప్రాజెక్టులపై కేసులు వేసింది. ఇంతటి బహుళదరణ కలిగిన ప్రాజెక్టులపై ప్రభుత్వ తప్పిదాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టింది. అటువంటి వారిలో..కేసీఆర్‌పై ఫైర్ అయ్యే నేతల్లో డీ..అంటే..డీ అనే స్థాయిలో తెలంగాణ కొత్త ఫైర్ బ్రాండ్‌గా పేరువడ్డ రచనారెడ్డి ఉన్నారు. ఆమే కేసీఆర్‌పై తన మాటల దాడితో ప్రజలను ఇట్టె ఆకర్షిస్తున్నారు. న్యాయవాదిగా మంచి పట్టు కూడా సాదించారు. అందుకే, రచనారెడ్డిని అధికారికంగా పూర్తి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. అయితే, మొదటి నుంచి టీజేఎస్ పని చేస్తున్నప్పటికి అధికారికంగా మాత్రం శుక్రవారం జన సమితిలో చేరారు. తెలంగాణలో మహకూటమి పొత్తుల వేలా పెద్ద నాయకులు ఎవరూ లేరు, ఎవరు పోటీ చేస్తారు, ఎవరు గెలుస్తారు అన్న మాట రాకుండా ఉండేందుకు, రచనారెడ్డి లాంటి వారిని పార్టీలోకి ఆహ్వనించారు. రచనారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రచనారెడ్డితో పాటు మరికొంతమందిని కూడా కోదండరాం పార్టీలోకి ఆహ్వనించగా, వారు మరికొద్దిరోజుల్లో పార్టీలోకి వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఇక, ఇప్పటికే ఈ పార్టీలో సీనియర్ నేతలైన గాదె ఇన్నయ్య, దిలీప్ కుమార్, రౌతు కనకయ్య, చింత స్వామి, విద్యాధర రెడ్డి, విశ్వేశ్వర్ రావు,గురిజాల రవీందర్, గోపాల్ శర్మ, శ్రీశైల్ రెడ్డి, భవానిరెడ్డి, చిందం రాజ్ కుమార్, రాజేందర్ రెడ్డితో పాటు మరికొంత మంది పోటీకి సిద్దంగా ఉన్నారు. ఇదిలా ఉంటే...తాజాగా భారిగా చేరికలు జరుగనున్నాయని...ఈ చేరికలే..పక్కా పార్టీ నేతలకు చెక్ పెట్టనున్నట్లు కనిపిస్తొంది. అయితే, కోదండరాం కూడా ఉద్యమ కారులు, అమర వీరుల ఆశయాలు సాదించాలంటే భారి సంఖ్య ఉంటేనే ప్రభుతవంలో డీ అంటే డీ అనేలా తలపడెందుకు సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.

English Title
The TJ's time to come
Related News