నేడు ఇండియా, పాకిస్థాన్ ఢీ

Updated By ManamWed, 09/19/2018 - 06:14
 India, Pakistan match today
  • సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం   

క్రికెట్ విషయానికొస్తే వేదిక ఏదైనా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. ఇప్పుడు అటువంటి ఆసక్తే ఆసియా కప్‌లో నెలకొంది. ఇండియా, పాకిస్థాన్ జట్లు బుధవారం దుబాయ్ వేదికగా తలపడబోతున్నాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ రెండు జట్లూ మరోసారి ఫైనల్లో తలపడే అవకాశం ఉంది. ఆసియా కప్ ముఖాముఖీ పోరులో టీమిండియాదే పైచేయి. ఇందులో ఆరు సందర్భాల్లో టీమిండియా గెలవగా.. ఐదు సందర్భాల్లో ఓటమిపాలైంది. ఒక మ్యాచ్ రద్దయింది. ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య అత్యుత్తమ మ్యాచ్‌లు మీ కోసం...

image


వేదిక: షార్జా
తేదీ: 1984 ఏప్రిల్ 13 
ఫలితం: 54 పరుగులతో టీమిండియా విజయం

ఆసియా కప్ తొలి ఎడిషన్ 1984లో యూఏఈలో జరిగిం ది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను టీమిండియా ఓడిం చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు సురిందర్ ఖన్నా, గులామ్ పారికర్ తొలి వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని అందించారు. 56 పరుగులతో ఖన్నా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సందీప్ పాటిల్ (43), కెప్టెన్ సునీల్ గవాస్కర్ (36 నాటౌట్) నాలుగో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో టీమిండియా 46 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 

తర్వాత మొహసిన్ ఖాన్ క్రీజులో ఉన్నంత వరకు పాకిస్థాన్ జట్టు లక్ష్యాన్ని చేరుకుంటుం దేమో అనిపిం చింది. కానీ అతను అవుటైన తర్వాత వరుస విరామ సమయాల్లో పాకిస్థాన్ వికెట్లు కోల్పోయింది. దీంతో పాక్ జట్టు 39.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌై టెంది. రోజర్ బిన్నీ, రవిశాస్త్రి చెరి మూ డేసి వికెట్లు తీసు కున్నారు. మరో నాలుగు వికెట్లు రనౌట్ల రూపంలో వచ్చాయి. 

వేదిక: ఢాకా
తేదీ: 2012 మార్చి 18 
ఫలితం: 6 వికెట్లతో టీమిండియా గెలుపు

ఆసియా కప్‌లో ఇండి యా, పాకిస్థాన్‌ల మధ్య జరి గిన మ్యాచ్‌ల్లో ఇది అత్యుత్త మైందని చెప్పొచ్చు. 330 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను ప్రసుత కెప్టెన్ విరాట్ కోహ్లీ 183 పరుగులతో గట్టెక్కించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు ఓపెనర్లు మహ్మద్ హఫీజ్, నాసిర్ జమ్‌షెడ్ భారత బౌలర్లపై విరుచుకుప డ్డారు. వీరిద్దరు సెంచరీలు చేసి తొలి వికెట్‌కు 224 పరుగులు అందించారు.

మిడిలార్డర్‌లో యూనిస్ ఖాన్ చెలరేగడంతో పాకిస్థాన్ 6 వికెట్ల నష్టానికి 329 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్ డకౌటయ్యాడు. కానీ అది టీమిండి యాపై ప్రభావం చూపలేకపోయింది. సచిన్,  కోహ్లీ కలిసి 133 పరుగుల భాగస్వా మ్యాన్ని అందించారు. ఆ తర్వా త రోహిత్‌తో కలిసి కోహ్లీ 172 పరుగుల భాగస్వామ్యా న్ని నెలకొల్పాడు. దీంతో టీమిండియా 6 వికెట్లతో గెలిచిం ది. కోహ్లీ 148 బంతుల్లో 22 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి అజేయంగా నిలిచాడు. కోహ్లీ చేసిన 183 పరుగులు ఇప్పటికీ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది. 

image


వేదిక: కరాచీ
తేదీ: 2008 జూన్ 26 
ఫలితం: 6 వికెట్లతో టీమిండియా గెలుపు

సొంత అభిమానుల ముందు షోయబ్ మాలిక్ రెచ్చిపోయాడు. భారత బౌలర్లపై విరుచుకుపడిన మాలిక్ 119 బంతుల్లో 125 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మాలిక్ 16 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు. యూసిన్ ఖాన్ కూడా 60 బంతుల్లో 59 పరుగులతో జట్టుకు తనవంతు సహకారం అందించాడు. మహ్మద్ యూసుఫ్ (30), మిస్బా ఉల్ హక్ (31 నాటౌట్) ఉపయోగకరమైన బ్యాటింగ్ చేయడంతో పాకిస్థాన్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే కష్టాలపాలైంది.

ఓపెనర్ గౌతమ్ గంభీర్ తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. అయితే వీరేందర్ సెహ్వాగ్, సురేష్ రైనా పాక్ బౌలర్ల భరతం పట్టారు. వీరిద్దరూ 198 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి టీమిండియా గెలుపును ఖాయం చేశారు. సెహ్వాత్ 95 బంతుల్లో 119, రైనా 69 బంతుల్లో 84 పరుగులు సాధించారు. యువరాజ్ సింగ్ (48), మహేంద్ర సింగ్ ధోనీ (26 నాటౌట్) జట్టుకు తమ వంతు సహకారం అందించడంతో టీమిండియా 42.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.

వేదిక: కరాచీ
తేదీ: 2008 జూలై 2 
ఫలితం: 8 వికెట్లతో పాకిస్థాన్ విజయం

2008 ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్ జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకున్నాయి. గ్రూప్ దశలో చవిచూసిన ఓటమికి పాకిస్థాన్ జట్టు ఎదురుదాడికి దిగింది. మరో భారీ స్కోరు మ్యాచ్‌లో 8 వికెట్లతో టీమిండియాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ 10.3 ఓవర్లలోనే 88 పరుగులు సాధించారు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ (76), రోహిత్ శర్మ (58) అర్ధ సెంచరీలు చేయగా.. ఇర్ఫాన్ పఠాన్ (38 నాటౌట్) డెత్ ఓవర్లలో రెచ్చిపోవడంతో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది.
 
తర్వాత 309 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్  జట్టుకు సల్మాన్ బట్, నాసిర్ జమ్‌షెడ్ గట్టి పునాది వేశారు. వీరిద్దరూ 8 ఓవర్లలో 65 పరుగులు సాధించారు. జమ్‌షెడ్ 43 బంతుల్లో 53 పరుగులు చేసి రిటైర్ హర్ట్ అయ్యాడు. తర్వాత యూనిస్ ఖాన్, కెప్టెన్ మిస్బా ఉల్ హక్ అజేయ 144 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో మరో 27 బంతులుండగానే పాకిస్థాన్ జట్టు గెలుపు తీరాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఫైనల్లో శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. 

వేదిక: ఢాకా
తేదీ: 2014 మార్చి 2 
ఫలితం: 1 వికెట్‌తో పాకిస్థాన్ విజయం

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ మిస్బా ఉల్ హక్ నిర్ణయానికి పాక్ బౌలర్లు అండగా నిలిచారు. ఆరంభంలోనే శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలను పెవిలియన్ పంపారు. అయినప్పటికీ రోహిత్ శర్మ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజాలు అర్థ సెంచరీలు చేయడంతో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది.
 
246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టుకు షార్జీల్ ఖాన్, అహ్మద్ షెహజాద్ శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగులు చేశారు. తర్వాత అమిత్ మిశ్రా, రవిచంద్రన్ అశ్విన్‌లు వెంటవెంటనే వికెట్లు తీయడంతో పాకిస్థాన్ 22.2 ఓవర్లలో 113 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వరుస విరామ సమయాల్లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో ఉన్న మహ్మద్ హఫీజ్ 75 పరుగులు సాధించాడు. అవసరాన్ని బట్టి రెచ్చిపోయిన షాహిద్ అఫ్రీది 18 బంతుల్లో 34 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో అఫ్రీది రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో పాకిస్థాన్ జట్టు 1 వికెట్‌తో గెలిచింది.

English Title
Today is India, Pakistan match today
Related News