నేడు మల్లన్న కళ్యాణోత్సవం

Updated By ManamSat, 08/18/2018 - 00:13
Mallanna Kalyan festival
  • ఢిల్లీలో శ్రీశైల మల్లిఖార్జున స్వామి వేడుక

  • మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహణ

srisailamన్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామివార్ల కళ్యాణోత్సవం, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని గోల్ మార్కెట్, ఉద్యాన మార్గ్‌లో గల తిరుమల తిరుపతి దేవస్థానాల బాలాజీ మందిర్ ప్రాంగణంలోని ధ్యాన మందిరంలో నిర్వహించనున్నట్టు శ్రీశైలం దేవస్థాన కార్యనిర్వహణాధికారి రామచంద్ర మూర్తి తెలిపారు. ఢిల్లీలోని తెలుగు ప్రజలు, ఢిల్లీవాసుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం, ఢిల్లీలోని తిరుమల తిరుపతి దేవస్థానాల సహకారంతో వేడుక నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉదయం 10.00 గంటలకు ‘మహన్యాసపూర్వక రుద్రాభిషేకం’, సాయంత్రం 6.30 గంటలకు ‘శ్రీశైల భ్రమరాంభ సమేత మల్లిఖార్జున స్వామివార్ల కల్యాణోత్సవం’ ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించడానికి దేవస్థాన ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ బి.వి.ఎస్. శాస్త్రి వారి పరివారం 15 మంది అర్చకులతో వచ్చారని తెలిపారు. రుద్రాభిషేకంలో పాల్గొనదలచిన దంపతులు/భక్తులు రూ.200 చెల్లించి టికెట్లు పొందాలని కోరారు. వివరాలకు వినోద్ (9392092013), జి.రామకోటయ్య (9654720499), నాగేశ్వరరావు (7893847742)లను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. కళ్యాణోత్సవంలో ప్రతిఒక్కరూ పాల్గొనవచ్చునని పేర్కొన్నారు. ఢిల్లీ వాసులు, తెలుగు ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్ల ఆశీస్సులు పొందాలని కోరారు. 

English Title
Today is Mallanna Kalyan festival
Related News