గాంధేయ పద్ధతిలో పెట్రోల్ బంకుల్లో మరుగుదొడ్లు

Updated By ManamTue, 10/31/2017 - 12:38
KTR, Public toilets, Petrol bunks, Central govt, Swachch bharath, swachch Telangana mission

KTR, Public toilets, Petrol bunks, Central govt, Swachch bharath, swachch Telangana mission హైదరాబాద్: నగరంలోని పారిశుద్ధ్య కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందించిందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో నగర అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధాన మిచ్చారు. జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ తో పాటు స్వచ్ఛ తెలంగాణలో భాగంగా పారిశుద్ధ్యం అనే అంశాన్ని కీలకంగా తీసుకున్నామని చెప్పారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వచ్చిన రూ. 3 కోట్లతో మరుగుదోడ్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. గాంధేయ పద్ధతిలో 295 పెట్రోల్ బంకుల్లో మరుగుదోడ్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అనే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లు నిర్మించాలని కేంద్రం ఇతర రాష్ర్టాలకు కూడా సూచించిందని కేటీఆర్ పేర్కొన్నారు.

English Title
toilets to be constructed in 295 petrol bunks , says KTR
Related News