కేరళకు సినీప్రముఖుల విరాళాలు..

Updated By ManamSun, 08/19/2018 - 13:52
Tollywood actors, donate relief fund, Kerala state, Jr NTR, akkineni nagarjuna (472), Vikram, Tamil actor Vijay
  • తమిళ నటుడు విజయ్ రూ. 14 కోట్లు విరాళం..

Tollywood actors, donate relief fund, Kerala state, Jr NTR, akkineni nagarjuna (472), Vikram, Tamil actor Vijayతిరువనంతపురం: వరద బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. కేరళను ఆదుకునేందుకు పలు రాష్ట్రాలు ముందుకొచ్చి విరాళాలను ప్రకటించగా, సినీ ప్రముఖలు, క్రీడాకారులు సైతం తమవంతు సాయాన్ని అందించేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ మా మూవీ అసోసియేషన్ రూ. 10లక్షల వరకు కేరళకు వరద సాయాన్ని ప్రకటించగా తెలుగు సినీ అగ్రహీరోలు సైతం తమ వంతు సాయాన్ని అందించారు. తాజాగా అక్కినేని నాగార్జున, ప్రభాస్‌, తారక్‌, కల్యాణ్‌ రామ్‌, మహేశ్‌బాబు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. నాగార్జున, అమల రూ.28 లక్షలు, ప్రభాస్‌ రూ.25 లక్షలు, ఎన్టీఆర్‌ రూ.25 లక్షలు, కల్యాణ్‌ రామ్‌ రూ.10 లక్షలు, విక్రమ్‌ రూ.35 లక్షలు, మహేశ్‌బాబు రూ.25 లక్షలు విరాళాలు అందించారు.

ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఏకంగా రూ.14 కోట్లు విరాళంగా ప్రకటించినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై విజయ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే కేరళ బాధితుల కోసం సామాన్య పౌరులు కూడా తమకు తోచినంత సాయం అందిస్తున్నారు. కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేరళ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. వరదలు ఉధృతి కారణంగా కొండ చరియలు విరిగిపడటం వంటి పలు ప్రమాదాల్లో ఇప్పటివరకు 300 మందికిపైగా మృత్యువాతపడ్డారు.

English Title
Tollywood actors donate relief fund to Kerala state
Related News