సాఫ్ట్‌వేర్ అబ్బాయితో గడసరి అమ్మాయి

Updated By ManamWed, 09/12/2018 - 02:39
tollywood

సుధీర్‌బాబు హీరోగా నటించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఆర్.నాయుడు దర్శకుడు. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ పతాకంపై హీరో సుధీర్‌బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్. నాయుడు మాట్లాడుతూ ‘‘సమ్మెహనం లాంటి మంచి బ్లాక్‌బస్టర్ తరువాత సుధీర్‌బాబుగారి నుంచి వస్తున్న చిత్రం కావటంతో ప్రేక్షకుల నుంచి అంచనాలు భారీగా వున్నాయి. సుధీర్‌బాబుగారి ఫస్ట్ ప్రొడక్షన్‌లో నన్ను నమ్మి, నా కథను నమ్మి అవకాశం ఇచ్చారు ఆయనకు స్పెషల్‌గా థాంక్స్ తెలియజేస్తున్నాను.

image


నన్ను దోచుకుందువటే చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధమైంది. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని చెప్పగలను’’ అని అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘‘ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు చిత్ర పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీ ప్రమోషనల్ టూర్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా థాంక్స్ చెబుతున్నాను. డైరెక్టర్ ఆర్.ఎస్.నాయుడు చాలా మంచి కథ స్క్రీన్ ప్లేతో సినిమా రూపొందించాడు. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే విధంగా సినిమా వచ్చింది’’ అని అన్నారు. 

English Title
tollywood movie
Related News