శంభు లింగేశ్వర స్వామికి ఉత్తమ్ పూజలు

Updated By ManamTue, 02/13/2018 - 09:58
TPCC Cheif Uttam Kumar Reddy

TPCC Cheif Uttam Kumar Reddy performs pooja at Sri Swayambu Shambu Lingeshwara Swamy Templeసూర్యాపేట: మహా శివరాత్రి సందర్బంగా జిల్లాలోని మేళ్లచెర్వు శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం ఉత్తమ్‌‌ను దేవస్థాన అర్చకులు, దేవాలయ కమిటీ వారు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

English Title
TPCC Cheif Uttam Kumar Reddy performs pooja at Sri Swayambu Shambu Lingeshwara Swamy Temple
Related News