ఎన్నికల అభ్యర్థుల జాబితాపై ఉత్తమ్ స్పందన

Updated By ManamTue, 02/13/2018 - 14:49
TPCC chief denies releasing list of candidates

TPCC chief denies releasing list of candidatesహైదరాబాద్: గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ గురించి పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. 2019 ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆ ఎన్నికల్లో పోటీచేసేది వీళ్లేనని ఓ జాబితా నెట్టింట్లో పెట్టి కొందరు నానా హంగామా చేస్తున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఎట్టకేలకు రూమర్స్‌కు తెరదించారు.

సోషల్ మీడియాలో వస్తున్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ప్రాపబుల్ లిస్టు వైరల్ అవుతుందనీ అయితే ఆ లిస్టుకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఉత్తమ్ తేల్చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ లిస్టును నమ్మొద్దని ఆయన సూచించారు. ఆ లిస్టుకు ఎలాంటి అధికారిత లేదనీ.. అది అపోహలు మాత్రమేనని ఉత్తమ్ కొట్టిపారేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు గందరగోళానికి గురి కావొద్దని ఆయన స్పష్టం చేశారు.  కాంగ్రెస్ అధిష్టానం ఇంత వరకూ ఎలాంటి లిస్ట్‌ను విడుదల చేయలేదని టీపీసీసీ ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు.

English Title
TPCC chief denies releasing list of candidates
Related News