వాట్సాప్ సీఈవోతో రవిశంకర్ ప్రసాద్ భేటీ

Updated By ManamTue, 08/21/2018 - 15:02
whatsapp
WhatsApp

న్యూఢిల్లీ : వాట్సాప్‌కు భారత ప్రభుత్వం మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఫేక్ న్యూస్‌ను అడ్డుకట్ట వేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కేంద్ర న్యాయ, సమాచార శాఖ మంత్రి  రవిశంకర్ ప్రసాద్‌తో వాట్సప్ సంస్థ సీఈవో క్రిస్ డేనియల్ మంగళవారం భేటీ అయ్యారు. వాట్సాప్‌లో ఫేక్ న్యూస్ ప్రచారంపై ఈ సమావేశంలో చర్చించారు. నకిలీ వార్తలను అడ్డుకట్ట వేయడానికి కేంద్రమంత్రి ప్రధానంగా మూడు అంశాలను పేర్కొన్నారు.

అలాగే భారతీ చట్టాల ప్రకారం సోషల్ మీడియా నడుచుకోవాలని రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా వాట్సాప్ సీఈవోకు స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్‌ను ట్రాక్ చేసేందుకు ఓ సాంకేతిక పరిష్కారం చూపించాలని, అలాగే భారత్‌లో జవాబుదారిగా వాట్సాప్ సంస్థకు చెందిన ఓ అధికారి ప్రత్యేకంగా ఉండాలని ఉండాలని సూచించారు. 

మూడు ప్రధాన అంశాలు..
1. భారత్‌లో ప్రత్యేకంగా వాట్సాప్  ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించడం.
2. భారత చట్టాలకు అనుగుణంగా వాట్సాప్‌ నడుచుకోవడం. 
3. ఫేక్ న్యూస్ ట్రాక్ చేసేందుకు మరింతగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించేలా చేయడం

భేటీ అనంతరం రవిశంకర్ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...ఓవైపు వాట్సాప్‌తో ఉపయోగాలతో పాటు, మరోవైపు నకిలీ వార్తల బెదడ వల్ల నేరాలు కూడా పెరిగిపోతున్నాయన్నారు. విద్య, ఆరోగ్యం, కేరళకు సాయం విషయంలో వాట్సాప్ భాగస్వామ్యాన్ని అభినందించిన ఆయన...ఫేక్ న్యూస్ వల్ల దాడులు, ప్రతికారాలకు వాట్సాప్ కారణం అవుతోందన్నారు.

ఇది భారతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా  ఫేక్‌న్యూస్‌కు చెక్ పెట్టడానికి ఫార్వర్డెడ్ మెసేజ్ లేబుల్‌తోపాటు ఇలాంటి మెసేజ్‌లను ఐదుగురి కంటే ఎక్కువమందికి ఫార్వర్డ్ చేయకుండా పరిమితి విధించిన విషయం తెలిసిందే.

English Title
Trace fake messages, comply with Indian laws: Centre warns WhatsApp
Related News