మార్కెట్లను కుంగదీసిన వాణిజ్య ఉద్రిక్తతలు

Updated By ManamMon, 09/10/2018 - 22:32
bse

bseముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం 1 శాతం పైగా నష్టపోయి మూడు వారాల కనిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీలు క్షీణించాయి. రూపాయి మరింత క్షీణించి డాలర్‌తో మారకం విలువలో డే-ట్రేడ్‌లో మునుపెన్నడూ లేనతంగా రూ. 72.67కి పడిపోయింది. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ 467.65 పాయింట్లు నష్టపోయి, మూడు వారాల కనిష్ఠ స్థాయి 37,922.17 వద్ద ముగిసింది. ఈ మార్చి 16న అది 509.54 పాయింట్లు కోల్పోయింది. తిరిగి ఒకే రోజులో ‘సెన్సెక్స్’ అంత ఎక్కువ స్థాయిలో పాయింట్లను నష్టపోవడం సోమవారం (సెప్టెంబర్ 10న) సంభవించింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కీలకమైన 11,500 స్థాయికన్నా కిందకు పడిపోయి 151 పాయింట్లు కోల్పోయింది. అది 11,438.10 వద్ద ముగిసింది. ఆగస్టు 16 తర్వా త, అది అంత తక్కువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. సోమవారం ఇంట్రా-డేలో అది 11,427.30 కనిష్ఠ స్థితిని చూసింది. ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఘర్షణ పెచ్చుమీరవచ్చనే భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మొత్తం చైనా దిగుమతులన్నింటిపైనా సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారంనాడు హెచ్చరించారు. అమెరికా కొత్తగా ఎటువంటి చర్యలు తీసుకున్నా అంతకు అంత చర్యలు తీసుకునేందుకు తామూ వెనుకాడేది లేదని చైనా ప్రకటించింది. ఈ రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరమైతే అది ప్రవర్థమాన మార్కెట్లపై ప్రభావం చూపుతుందనే భయాలు వ్యాపించాయి. 

మూడ్‌ను దెబ్బతీసిన మూడీస్
రూపాయి బలహీనపడుతూండడం భారతీయ కంపెనీలకు ‘‘క్రెడిట్ నెగిటివ్’’గా పరిణమిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొనడంతో కూడా సెంటిమెంట్ దెబ్బతింది. రూపాయలలో రాబడులను జనరేట్ చేస్తూ, తమ కార్యకలాపాలకు నిధుల కోసం మాత్రం అమెరికా డాలర్ల రుణంపై ఆధారపడే భారతీయ కంపెనీలు చిక్కులు ఎదుర్కోవలసి రావచ్చని ఆ సంస్థ తెలిపింది. భారతీయ రూపాయి 2018లో ఇంతవరకు 13 శాతం క్షీణించింది. సోమవారం అది రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో కోలుకోవ డానికి ముందు రూ. 72.67కి పడిపోయింది. అమెరికాలో ఉద్యోగా ల డాటా పటిష్టంగా ఉండడంతో డాలర్  మరింత బలపడింది. మరోపక్క ముడి చమురు ధరలు భగ్గమంటూనే ఉన్నాయి. 

పెరుగుతున్న వ్యత్యాసం
భారతదేశపు కరెంట్ అకౌంట్ లోటు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో 15.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ లోటు 2017-18 ఆర్థిక సంవత్సరం అదే త్రైమాసికంలో 15 బిలియన్ డాలర్లుగా ఉంది.

English Title
Trade tensions that have plagued the markets
Related News