హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Updated By ManamFri, 11/09/2018 - 11:40
Traffic diversions ahead of Sadar Utsav Mela at the YMCA, Narayanaguda
Traffic diversions ahead of Sadar Utsav Mela at the YMCA, Narayanaguda

హైదరాబాద్ : నగరంలో దీపావళి పర్వదినం పురస్కరించుకుని గ్రేటర్ ప్రజలు నారాయణగూడ వైఎంసీఏ వద్ద జరుపుకునే సదర్ ఉత్సవ మేళా సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. కాచిగూడ క్రాస్‌రోడ్డు నుంచి వైఎంసీఏ నారాయణగూడకు వాహనాలు అనుమతించమని ఈ మార్గంలో వచ్చే వాహనాలు టూరిస్ట్ హోటల్ మీదుగా వెళ్లాలని సూచించారు. విఠల్ క్రాస్‌రోడ్ మీదుగా వచ్చే వాహనాలు రామ్‌కోఠి క్రాస్‌రోడ్ నుంచి, రాజ్‌మహల్ నుంచి వచ్చే వాహనాలు రామ్‌కోఠి క్రాస్‌రోడ్ సబూ షాప్ వద్ద నుంచి, రెడ్డీ కాలనీ (కాలనీ నంబర్ 8) నుంచి వచ్చే వాహనాలు బర్కత్‌పురా నుంచి దారి మళ్లీస్తారని తెలిపారు. 

అదేవిధంగా ఓల్డ్ బర్కత్‌పురా పోస్టాఫీస్ నుంచి వచ్చే వాహనాలు క్రోన్ కేఫ్ మీదుగా, ఓల్డ్ ఎక్సైజ్ ఆఫీస్ నుంచి వచ్చే వాహనాలు విఠల్ వాడీ మీదుగా, బర్కత్‌పురా చమాన్  మీదుగా వచ్చే వాహనాలు టూరిస్ట్ హోటల్ వద్ద నుంచి నారయణగూడ ఫ్లైఓవర్ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ వద్ద నుంచి వచ్చే వాహనాలు నారాయణగూడ క్రాస్‌రోడ్ మీదుగా దారి మళ్లీస్తారని సీపీ తెలిపారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి శనివారం వరకు అమల్లో ఉంటాయని సీపీ పేర్కొన్నారు.

English Title
Traffic diversions ahead of Sadar Utsav Mela at the YMCA, Narayanaguda
Related News