హనీమూన్ కోసం.. రైలు బుకింగ్!

Updated By ManamSun, 09/02/2018 - 00:23
honeymoon

కోయంబత్తూరు: లాహిరి.. లాహిరి.. లాహరిలో..  అంటూ రైలులో హనీమూన్ జరుపుకుంటే ఎలా ఉంటుంది! సరిగ్గా బ్రిటన్‌కు చెందిన కొత్త దంపతులు తమ హనీమూన్‌ను రైలులో గడపాలని నిర్ణయించుకున్నారు. అది కూడా.. భారత్‌లో!! దక్షిణ  రైల్వే ప్రవేశపెట్టిన ఈ సౌకర్యాన్ని వారు తొలిసారి ఉపయోగించుకుని రికార్డు సృష్టించనున్నారు. నీలగిరి కొండల మధ్య.. మెట్టుపాలయం నుంచి ఉదగమండలం వరకు వెళ్లే రైలులో ‘హనీమూన్’ను ఎంజాయ్ చేయనున్నారు.

image


ఇంగ్లాండ్‌కు చెందిన గ్రాహం విలియం (30), సిల్వియా ప్లాసిక్ (27)లకు ఈ మధ్యే పెళ్లయింది. హనీమూన్‌కోసం భారత్‌కు వచ్చిన వారు.. దక్షిణ మధ్య రైల్వే ఆఫర్‌కు పడిపోయారు. ఆన్‌లైన్‌లో దాదాపు రూ.3 లక్షలు చెల్లించి రైలులోని మొత్తం 120 సీట్లను బుక్ చేసుకున్నారు. మెట్టుపాలయంలో ఉదయం 9.10 గంటలకు బయలుదేరే ఈ రైలు... ఊటీకి మధ్యాహ్నం 2.40 గంటలకు చేరుకుంటుంది. టూరిజంను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మొత్తం రైలు బుకింగ్ సౌకర్యాన్ని ఈ మధ్యే దక్షిణ రైల్వే ప్రవేశపెట్టింది. ఈ అవకాశాన్ని బ్రిటన్ దంపతులు తొలిసారి ఉపయోగించుకోవడం విశేషం.

English Title
Train booking for honeymoon!
Related News