నా కుమారుడి చుట్టూ కుట్ర జరుగుతోంది

Updated By ManamMon, 09/03/2018 - 11:06
Simbu

Simbuతన కుమారుడి చుట్టూ కుట్ర జరుగుతోందని శింబు తండ్రి, నటుడు, దర్శక నిర్మాత టీ.రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వనవాసం నుంచి ఇప్పుడు తనకు విముక్తి కలిగిందని అన్నారు. రాజకీయాల్లో తాను ఎంజీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశానని, రాజకీయ పార్టీని ప్రారంభించడానికి చాలా సహనం అవసరం అని అన్నారు. 

పోరాటం తరువాతే కరుణానిధి డీఎంకే అధ్యక్షుడయ్యారని గుర్తు చేశారు. పార్టీ అధ్యక్ష పదవి అన్నది సాధారణ విషయం కాదని, తల చుట్టూ వేడెక్కించే మంట లాంటిదని పేర్కొన్నారు. తాను రాజకీయవాదినని చెప్పడం  కంటే ఆధ్యాత్మిక వాదినని చెప్పుకుంటానన్నారు. తాను ఆధ్యాత్మికంగానే నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానన్నానని పేర్కొన్నారు. అయితే ఫ్యాషన్ అనే నూతన నిర్మాణ సంస్థలో అరసన్‌ చిత్రంలో నటించడానికి శింబు 2013లో రూ.50 లక్షలు అడ్వాన్స్‌ పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆ సంస్థలో చిత్రం చేయకపోవడంతో ఆ సంస్థ అధినేతలు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయస్థానం నటుడు శింబు అడ్వాన్స్‌గా తీసుకున్న రూ.50 లక్షలకు వడ్డీతో కలిపి మొత్తం రూ.85లక్షలను నాలుగు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

English Title
T.Rajender comments on Simbu's issue
Related News