ట్రెండీ హాండ్స్

Updated By ManamWed, 03/14/2018 - 01:09
dipika

imageఓవర్ సైజ్డ్ స్లీవ్స్ ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు బెల్ హ్యాండ్స్, పుష్‌బ్యాక్ హ్యాండ్స్‌గా పేరుగాంచిన స్లీవ్స్ ఇప్పుడు ఓవర్ సైజ్డ్ స్లీవ్స్ పేరుతో ఫ్యాషన్ ప్రపంచంలో మరోమారు స్టైలిష్ ట్రెండ్‌గా మారాయి. ఫ్యాషన్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..అందునా సమ్మర్ వచ్చిందంటే ఇలాంటి ఓల్డ్ ట్రెండ్స్ న్యూ ట్రెండ్స్‌గా మారిపోతుంటాయి. దీంతో ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలంతా ఈ ట్రెండీ హ్యాండ్స్‌తో తళుక్కుమంటున్నారు. మీకు రెడీమేడ్‌లో ఈజీగా దొరికే ఈ ఫిట్టింగ్ .. వెస్ట్రన్, ఎథ్నిక్, ఫ్యూజన్ డిజైన్స్‌కు అన్నింటికీ నప్పేలా ఉండడం దీని ప్రత్యేకత.

 

 

 

బెలూన్ స్లీవ్స్
బెల్డ్ కఫ్‌తో పాటు బెలూన్ స్లీవ్స్‌గా ఫ్యాషన్ లవర్స్‌కు ఫెimageమిలియర్ అయిన ఈ హ్యాండ్స్ సమ్మర్‌లో చాలా కూల్ లుక్ ఇస్తాయి. అంతేకాదు సన్ బర్న్‌నుంచి కాపాడుకునే ఛాన్స్ లభిస్తుంది కనుక సెలబ్స్ సమ్మర్‌లో బెలూన్ స్లీవ్స్‌ను క్రేజీగా ధరిస్తారు. గౌన్ అయినా కుర్తీ అయినా లేక వెస్ట్రన్ టాప్ అయినా అన్నింటిలో ఓవర్ సైజ్డ్ హ్యాండ్స్ న్యూ స్టైల్‌గా మారిన ప్రస్తుత తరుణంలో  దీనిపై చాలా ప్రయోగాలు చేస్తున్న డ్రెస్ డిజైనర్స్ మార్కెట్లో ఓవర్ సైజ్డ్ స్లీవ్స్‌పై మంచి హ్యాండ్ వర్క్ కూడా చేసి వావ్ అనిపించేలా డిజైన్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఫస్ట్ స్టైల్ స్టేట్‌మెంట్ ఇచ్చే దీపికా పదుకున్, సోనమ్ కపూర్‌లు అప్పుడే వీటిని ట్రై చేసేసారు. హిందీ సీరియళ్లలోకూడా ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి సమ్మర్‌లో కొత్త ఫ్యాషన్‌ను ఎంజాయ్ చేయండి.

English Title
trendy hands
Related News