మరో వివాదంలో త్రిష

Updated By ManamSat, 09/22/2018 - 10:39
Trisha Krishnan
Trisha Krishnan

వరుస సినిమాలతో బిజీగా ఉన్న చెన్నై చిన్నది త్రిష ఇటీవలే దుబాయి పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఓ స్విమ్మింగ్‌పూల్‌లో డాల్ఫిన్‌తో కలిసి త్రిష తీసుకున్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి. వీటిపై చాలా క్యూట్ అంటూ ఆమె అభిమానులు మెచ్చుకుంటుంటే మరోవైపు విమర్శలు వినిపిస్తున్నాయి.

జీవ ప్రాణుల సంరక్షణ సంస్థ(పెటా)కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న త్రిష జలజీవాలను హింసిస్తుందా అంటూ ఆ సంస్థకు చెందిన వారు త్రిషపై మండిపడుతున్నారు. స్వేచ్ఛగా జీవించే డాల్ఫిన్లతో తన సరదాలు తీర్చుకోవడం ఏంటి..? అసలు వాటి స్వేచ్ఛను హరించే హక్కు ఆమెకు ఎవరిచ్చారు అంటూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా నిర్వాహకులు పరిదా తంబల్ విమర్శించారు. మూగ జీవాలను వాటి మానాన జీవించనీయండి అంటూ పరిదా అన్నారు. కాగా విజయ్ సేతుపతి సరసన త్రిష నటించిన 96 విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు రజనీకాంత్ సరసన పేటలో ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెలిసిందే.

English Title
Trisha in another controversy
Related News