టీఆర్‌ఎస్‌దే గేలుపు

Updated By ManamSat, 09/08/2018 - 22:54
trs
  • సనాతన ధర్మ పరిరక్షణకుకృషిచేస్తున్న పార్టీకే హిందూధర్మం మద్దతు

  • శ్రీ రామానుజ వ్రతధర జీయరుస్వామి... జాతీయ అధ్యక్షులు అఖిల భారత హిందూ మహాసభ

trsహైదరాబాద్: త్వరలో తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పార్టీకి అఖిల భారత హిందూ మహాసభ మద్దతు ఉంటుందని పేర్కొంది. అదిశగా టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని శ్రీ రామానుజ వ్రతధర జీయరుస్వామి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సనాతన ధర్మ పరిరక్షణకు విశేషంగా కృషిచేస్తున్నారన్నారు. కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో హిందూధర్మం విషయంలో వీరు నిబద్ధతతో పనిచేస్తున్నాని ఆయన పేర్కోన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవలంబిస్తున్న ధార్మిక కార్యక్రమాలు దేశంలో మిగతా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. వారు అద్వితీయంగా నిర్వహించిన అయుత చండీయాగం యావత్తు హైందవ సమాజం దృష్టిని ఆకర్షించిందన్నారు. రాజ్యాంగ హోదాలో ఉండి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు అత్యంత భక్తిశ్రద్ధలతో లోక కళ్యాణం ఉద్దేశంతో నిర్వహించిన ఈ మహాయాగం సనాతన దర్మ పరిరక్షణకు దోహదపడిన అపూర్వఘట్టమని ఆయన పేర్కోన్నారు. సుమారు వేయి కోట్లతో యాదాద్రి దేవస్థానాన్ని దివ్యక్షేత్రంగా పునర్నిర్మిస్తుండటం, ఇంకా వందలాది కోట్లతో భద్రాచలం, వేములవాడ, బాసర తదితర క్షేత్రాలను అభివృద్ధిపరుస్తుండటం, ఇంకా పురాతన దేవాలయాల పునరుద్ధరణకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తుండటం,మూడు వేలకు పైగా ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకంతో భాగంగా ప్రతినెలా ఆరు వేల రూపాయలు ఇస్తుండటం తదితర ధార్మిక కార్యకలాపాలు భారతీయ సంస్కతి పరిరక్షణకు జవసత్వాలను కలిగించడమే కాక హిందూ సమాజానికి గొప్ప మేలు చేయటమేనని అఖిల భారత హిందూ మహాసభ భావిస్తున్నదని చెప్పారు. స్వామీజీలు, పీఠాధిపతులు, సంతులు, ఆధ్యాత్మికవేత్తలను అయుత చండీయాగం, పుష్కరాలు, ఇతర ధార్మికోత్సవాల్లో తగిన వధంగా గౌరవించటం, ధార్మిక విషయాలపై వారు తగిన సలహాలను తీసుకుంటుండటం గొప్పవిషయం. పలు హిందూ పండగలకు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వ పక్షాన రాష్ట్ర పండగలుగా ప్రకటించి వైభవంగా నిర్వహిస్తుండటం ముఖ్యమంత్రి చంద్ర శేఖరరావు ధర్మ నిబద్ధతకు నిదర్శనమన్నారు. శనివారం హిందూ సమాజానికి పెద్దదిక్కుగా, గొప్ప దార్శనికుడిగా అందరి మన్ననలను అందుకుంటున్న వారికి అఖిల భారత హిందూ మహాసభ పక్షాన పూర్తి మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో వారు ఘన విజయం సాధించి తెలంగాణ రాష్ట్రం ఒక ధార్మిక రాష్ట్రంలో దేశానికి ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చేయూతనిచ్చి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నికై ధర్మ రాజ్యం దిశగా తెలంగాణను ముందుకు తీసుకువెళ్లేలా యావత్తు హైందవ సమాజం కృషి చేయాలని అఖిల భారత హిందూ మహాసభ తరపునా పిలుపునిస్తున్నామని ...మంగళా శాసనములతో కేసీఆర్ సీఎం కావాలని ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలో చెప్పారు.

Tags
English Title
trs
Related News