ఓట్ల గల్లంతు వెనుక టీఆర్‌ఎస్ కుట్ర 

Ramacandarravu
  • బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఆరోపణ

హైదరాబాద్: తాజా ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకుని, ఓటమికి కారణాలను విశ్లేషించుకున్నామని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవి స్తున్నామని, కార్యకర్తలు ఓటమికి కుంగిపోవద్దు అన్నారు. ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాటం చేద్దాం. ఓట్ల గల్లంతు చాలా ఇబ్బందికరమైన అంశ మన్నారు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించిందని ఆరోపించారు. ఓట్ల గల్లంతు వెనుక టీఆర్ ఎస్, ఎంఐఎం కుట్ర ఉందన్నారు. ఓట్లన మోదు కార్యక్రమాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంటుంది. ఓట్ల నమోదు కార్యక్రమంపై ప్రజల కు అవగాహన కల్పిస్తాం. ఓట్ల గల్లంతు కుట్రకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసు కోవాలి అని డిమాండ్ చేశారు.రాష్ర్టంలో ఎన్నికల కమిషన్ వైఫల్యాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ద ష్టికి తీసు కువెళ్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పక్షానే ఉంటారు. శబరిమల విషయంలో సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నాం. శబరిమలలో అల్లర్లకు సీపీఎం కారణమని ఆరోపించారు.

సంబంధిత వార్తలు