ఆరోపణలపై స్పందించిన ఎంపీ బాల్క సుమన్‌

Updated By ManamFri, 07/06/2018 - 20:51
Balka suman
  • ఆరోపణలు రుజువు చేస్తే ప్రాణ త్యాగం

  • అంబేద్కర్ సాక్షిగా ఉరి వేసుకుంటా

balka suman

హైదరాబాద్‌ :   తనపై వచ్చిన ఆరోపణలపై టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ స్పందించారు. రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓర్వలేక తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.  తనపై వచ్చిన ఆరోపణలపై ఆధారాలతో రుజువు చేస్తే లోయర్ ట్యాంక్ బండ్‌ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం  సాక్షిగా ఉరి వేసుకోని ప్రాణ త్యాగానికి సిద్ధమన్నారు. దళిత ఎంపీ అయిన తనను రాజకీయంగా ఎదురుకొనే సత్తాలేకే ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం తనపై మానసిక దాడిగా పరిగణిస్తున్నానని బాల్క సుమన్‌ అన్నారు. 

భార్య, కుమారుడితో కలిసి తాను దిగిన ఫోటోను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతున్న మంచిర్యాలకు చెందిన ఇద్దరు మహిళలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిపై కేసులు కూడా నమోదు చేసి, అరెస్ట్‌ చేసినట్లు ఎంపీ తెలిపారు. ఆ తర్వాత కూడా వాళ్లిద్దరూ మెసేజ్‌ల ద్వారా బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, తన ఇంటికి వచ్చి కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారని, అయితే మహిళలు అయినందున వారిపై తాను ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఈ మేరకు ఎంపీ బాల్క సుమన్‌ శుక్రవారం ఓ లేఖ విడుదల చేశారు.

English Title
TRS MP Balka Suman Clarification On Social media news about morphing Photos
Related News