ఎంపీ బాల్కకు ఎమ్మెల్యే టికెట్...

Updated By ManamThu, 09/06/2018 - 15:54
TRS MP Balka suman Get Chennur Assembly Ticket
TRS MP Balka suman Get Chennur Assembly Ticket

హైదరాబాద్ : పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం నుంచి బాల్క సుమన్ పోటీ చేయనున్నారు. అయితే పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎంపీ జి.వివేకానంద్‌ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ... గురువారం 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 

అయితే రెండు స్థానాలు (చెన్నూర్, ఆంధోల్)కు మాత్రం సిట్టింగ్‌లకు కాకుండా వేరే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. 2014లో చెన్నూర్ నుంచి నల్లాల ఓదేలు గెలుపొందగా, ఈసారి ఆ సీటును బాల్క సుమన్‌కు కేటాయించడం జరిగింది. మరోవైపు ఆంధోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్‌కు కూడా మొండిచేయి లభించింది. ఆయనకు పార్టీ టికెట్ నిరాకరించిన కేసీఆర్... ఆ నియోజకవర్గ అభ్యర్థిగా జర్నలిస్ట్ క్రాంతి కిరణ్‌ పేరును ప్రకటించారు.

English Title
TRS MP Balka suman Get Chennur Assembly Ticket
Related News