టీఆర్ఎస్‌కి 100 సీట్లు ఖాయం: కేటీఆర్

Updated By ManamSun, 08/26/2018 - 18:09
KTR, TRS, 100 seats, KCR, elections

KTR, TRS, 100 seats, KCR, electionsహైదరాబాద్: ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్‌కి 100 సీట్లు ఖాయమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ముందస్తంటే ఎన్నికలకు భయమెందుకు? అని ఆయన ప్రశ్నించారు. కొంగరకలాన్‌లో ప్రగతి నివేదిన సభ ఏర్పాట్లను ఆదివారం కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపక్షాలకు తాము జవాబుదారి కాదని, ప్రజలే తమ బాస్‌లుని కేటీఆర్ పునరద్ఘాటించారు. తాము ప్రజల మనసు దోచకుంటాం.. కాంగ్రెస్‌లా ప్రజలనే దోచుకోమని అన్నారు. ముందస్తుపై వారం పదిరోజుల్లో స్పష్టత వస్తుందని కేటీఆర్ తెలిపారు.

అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందామన్నారు. సెప్టెంబర్ 2న అపురూప వేదిక చూడబోతున్నారని అన్నారు. రెండు వేల ఎకరాల్లో సభ, 500 ఎకరాల సభా ప్రాంగణం ఉంటుందని తెలిపారు. 200, 100 ఫీట్ల రోడ్‌లు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 200లకు పైగా యంత్రాలు పనిచేస్తున్నాయన్నారు. ప్రగతి నివేదన సభకు పార్టీ నిధుల్నే ఖర్చు చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఎనిమిది కమిటీలు వేశామన్నారు. హైదరాబాద్ నుంచి మూడు లక్షల మందని సభకు తరలిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 

English Title
TRS will get 100 seats when will elections come, says KTR 
Related News