అమెరికా విదేశాంగ మంత్రి ఔట్

Updated By ManamWed, 03/14/2018 - 09:57
Trump Fires US Secretary Of State
  • అర్ధంతరంగా ఉద్వాసన పలికిన ట్రంప్ ప్రభుత్వం 

Trump Fires US Secretary Of State

వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి పదవి ఊడిపోయింది. రెక్స్ టిల్లర్సన్‌కు అమెరికా అధ్యక్షుడు ఉద్వాసన పలికారు. టిల్లర్సన్ స్థానంలో సీఐఏ డైరెక్టర్ మైక్ పొంపియోను నియమించారు. టిల్లర్సన్ ఆఫ్రికా పర్యటనలో ఉండగానే అర్ధంతరంగా ఆయన్ను పదవిలో నుంచి తీసేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక, మైక్ పొంపియో తర్వాత సీఐఏ డైరెక్టర్ బాధ్యతలను ఆయనకు డిప్యూటీ అయిన గినా హాస్పెల్ ఆ బాధ్యతలను చేపట్టనున్నారు. తద్వారా సీఐఏకి తొలి మహిళా డైరెక్టర్‌ను నియమిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. కాగా, ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై నలుమూలల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టిల్లర్సన్‌ను తీసేయడం అత్యంత హేయమైన చర్య అని ప్రజలు మండిపడుతున్నారు. కాగా, అంతకుముందు ట్విట్టర్‌లో బహిరంగంగానే టిల్లర్సన్‌పై తిట్ల వర్షం కురిపించారు. టిల్లర్సన్ తన ఉద్వాసన గురించి కూడా ట్విట్టర్ ద్వారానే తెలుసుకున్నట్టు సమాచారం. తనను తీసేస్తున్నట్టు అధికారికంగా ఎవరూ చెప్పలేదని తెలుస్తోంది. 

English Title
Trump Fires US Secretary Of State
Related News