టీటీడీలో లైంగిక వేధింపుల కలకలం

Updated By ManamThu, 08/23/2018 - 10:38
TTD

TTDతిరుపతి: పవిత్ర తిరుపతి దేవస్థానం సంస్థ టీటీడీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తన కూతుర్ని ఏఈవో శ్రీనివాసులు వేధిస్తున్నాడని, టీటీడీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని ఆరోపణలు చేశారు. శ్రీనివాస మంగాపురం ఆలయంలో శ్రీనివాసులు ఏఈవోగా పనిచేస్తుండగా.. తన కూతురిని వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గత కొంతకాలంగా తమ కుమార్తెకు ఫోన్ చేస్తున్న శ్రీనివాసులు నా మాట వినకపోతే మీ అమ్మను బదిలీ చేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

English Title
TTD AEO misbehaviour with employee
Related News