నేలను తాకిన ఉత్సవ విగ్రహం!

Updated By ManamSun, 09/09/2018 - 05:44
ttd
  • తిరుమల ఆలయంలో ఘటన.. నేలను తాకిన మలయప్ప విగ్రహం

  • ఆగమోక్తంగా లఘు సంప్రోక్షణ.. మడతపడిన అర్చకస్వామి కాలు

  • తిరుమల ఆలయంలో ఘటన

ttdతిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహం నేలను తాకింది. తిరుమల ఆలయంలో శనివారం సాయంత్రం బంగారు వాకిలి నుంచి గర్భాలయానికి శ్రీ మలయప్పస్వామి వారిని (ఉత్సవ విగ్రహాన్ని) అర్చక స్వాములు తీసుకువెళ్తున్న సందర్భంలో, అర్చకస్వామి కాలు మడత పడి, నేలపైకి జారడం వలన శ్రీ మలయప్పస్వామివారి విగ్రహం నేలను తాకింది. ఇందుకు సంబంధించి ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహదారు ఎన్.ఎ.కె.సుందరవరద భట్టచార్యుల సూచనల మేరకు ప్రాయశ్చిత్తంగా శ్రీవారి యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా లఘు సంప్రోక్షణ నిర్వహించారు.

English Title
ttd news
Related News